HIT 3 Movie Review: హిట్ 3.. అబ్‌కీ బార్ అర్జున్ సర్కార్..! నాని యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా.?

నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి హిట్ 3 ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందా..? నాని మరోసారి నిర్మాతగా సక్సెస్ అయ్యాడా..?

నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి హిట్ 3 ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందా..? నాని మరోసారి నిర్మాతగా సక్సెస్ అయ్యాడా..? హీరోగా ఏం చేసాడు అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

అర్జున్ సర్కార్ (నాని) రూత్ లెస్ కాప్. 100 మంది అమాయకులు చచ్చినా పర్లేదు గానీ ఒక్క క్రిమినల్ మాత్రం బతక్కూడదు అనుకునే మనిషి. తన చేతికి దొరికిన క్రిమినల్స్‌కు నరకం చూపిస్తుంటాడు అర్జున్. అలాంటి క్రేజీ కాప్ చేతికి ఓ సైకో కిల్లర్ వస్తుంది. వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతుంటాడు. అలాంటి కేసులోకి అర్జున్ సర్కార్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి.. ఆ తర్వాత తన లాఠీకి పని చెప్తాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు.. అతడి మోటో ఏంటి.. ఎందుకిలా హత్యలు చేస్తున్నాడు అనేది మిగిలిన కథ..