Pawan Kalyan - OG: ఉన్నట్టుండి అభిమానులకు షాకిచ్చిన OG.! తమన్ షేర్ చేసిన అప్డేట్.

Pawan Kalyan – OG: ఉన్నట్టుండి అభిమానులకు షాకిచ్చిన OG.! తమన్ షేర్ చేసిన అప్డేట్.

Anil kumar poka

|

Updated on: Mar 17, 2024 | 2:03 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటస్తోన్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఓజీ. సాహోతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జపాన్, ముంబై నగరాల్లో ని గ్యాంగస్టర్స్ కథాంశంతో ఎంతో స్టైలిష్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, పవన్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీ సినిమాను..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటస్తోన్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఓజీ. సాహోతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జపాన్, ముంబై నగరాల్లో ని గ్యాంగస్టర్స్ కథాంశంతో ఎంతో స్టైలిష్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, పవన్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఇది వరకే మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం పవన్ ఎన్నికల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ కాస్త బ్రేక్ పడింది. దీంతో ఫ్యాన్స్ కాస్తా నిరాశకు గురయ్యారు. వాళ్లలో నిరాశను తొలిగించేందుకే అన్నట్టు.. ఉన్నట్టుండి సడెన్‌గా ఓజీ నుంచి ఒక పవర్ ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఓజీ సినిమాకు స్వరాలు సమకూరుస్తోన్న సంగీత దర్శకుడు తమన్.. పవన్ కల్యాణ్‌ నయా పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్టర్ లో కత్తి పట్టుకుని ప్రత్యర్థులను తెగనరుకుతూ బట్టల నిండా రక్తంతో కనిపించాడు పవన్. ప్రస్తుతం ఈ పోస్టర్ అక్రాస్‌ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఓజీ నయా పోస్టర్‌ను అందులో.. పవన్ పోజ్‌ను చూసిన నెటిజన్స్‌… అండ్ పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్టర్‌నే తమ డీపీలుగా మార్చుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Mar 17, 2024 02:01 PM