Aparna Das – Deepak Parambol: మంజుమ్మల్ బాయ్స్ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
టాలీవుడ్ హీరోయిన్ అపర్ణా దాస్ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు నటుడు దీపక్ పరమాతో కలిసి గుడిలో ఏడడుగులు వేసింది. పెళ్లికి ముందు హల్దీ వేడుక, సంగీత్ ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా చేసుకున్న ఈ జంట.. పెళ్లి మాత్రం సంప్రదాయ పద్దతిలో వడకంచెరిలోని ఓ గుడిలో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా చేసుకున్నారు. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
టాలీవుడ్ హీరోయిన్ అపర్ణా దాస్ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు నటుడు దీపక్ పరమాతో కలిసి గుడిలో ఏడడుగులు వేసింది. పెళ్లికి ముందు హల్దీ వేడుక, సంగీత్ ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా చేసుకున్న ఈ జంట.. పెళ్లి మాత్రం సంప్రదాయ పద్దతిలో వడకంచెరిలోని ఓ గుడిలో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా చేసుకున్నారు. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన అపర్ణా దాస్, దీపక్ పరమా కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవలే నిశ్చితార్థ వేడుక అనంతరం తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ ప్రేమపక్షులు.. ఇప్పుడు పెళ్లి వేడుకతో ఒక్కటయ్యారు. అపర్ణా దాస్ తెలుగులో ఆదికేశవ చిత్రంలో నటించింది. యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఈసినిమాలో అపర్ణా దాస్ కీలకపాత్రలో కనిపించింది.
ఇక నాన్ ప్రకాశ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అపర్ణా దాస్… ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించి అలరించింది. ఇక నటుడు దీపక్ పరమా మలర్వాడి ఆర్ట్స్ క్లబ్ సినిమాతో రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించిన అతడు.. ఇటీవల బాక్సాఫీస్ సంచలనం మంజుమ్మెల్ బాయ్స్ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హీరోగా వరశం పరి సినిమాలో నటిస్తున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి మనోహరం సినిమాలో నటించారు. అదే సమయంలో వీరిద్దరి లవ్ స్టోరీ మొదలై.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!