కింగ్డమ్‌తో స్టార్ అయినా.. రోడ్డుపై అమ్మతో.. ఇడ్లీలు అమ్ముకోవడం మానని నటుడు
ప్రస్తుతం సెలబ్రిటీ హోదా అనుభవిస్తోన్న వారిలో చాలా మంది చిన్న తనంలో, టీనేజ్ లో ఎన్నో ఇబ్బందులు పడిన వారే. పొట్టకూటికోసం రకరకాల పనులు, ఉద్యోగాలు చేసిన వారే. కింగ్డమ్ ఫేమ్ వెంకిటేష్ కూడా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. తండ్రి చనిపోయినా, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా, స్నేహితులు, బంధువులు వద్దంటున్నా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.
ఎప్పుడు ఎక్కడ ఆడిషన్ జరిగినా వెళ్లాడు. తన ట్యాలెంట్ చూపించాడు. చిన్న రోల్స్ అయినా ఏ మాత్రం భేషజాలు లేకుండా నటించాడు. ఇంకా మంచి అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా ఎన్నో ఏళ్ల పాటు తిరిగాడు. సీరియల్స్, టీవీ షోలు, సినిమాలు ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా నో చెప్పకుండా నటించాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే కింగ్డమ్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకిటేష్. విజయ్ దేవరకొండ హీరోగా… గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన కింగ్డమ్ సినిమాలో… మురుగన్ గా నెగిటివ్ షేడ్ ఉన్న రోల్లో యాక్ట్ చేశాడు వెంకిటేష్. యాక్ట్ చేయడమే కాదు తన ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో మంచి మార్కులు వేయించుకున్నాడు. కాస్త వెనక్కి వెళితే.. కేరళకు చెందిన వెంకటేశ్ ఓ రియాలిటీ షోతో కెరీర్ ప్రారంభించాడు. అయితే అంతకు ముందు బతుకు తెరువు కోసం.. త్రివేంద్రంలో రోడ్ సైడ్ ఓ ఇడ్లీ స్టాల్ నిర్వహించాడు. ప్రత్యేకించి ఇడ్లీలకే ఆ కొట్టు బాగా ఫేమస్. అక్కడ రకరకాల వెరైటీ ఇడ్లీలు దొరుకుతాయి. ‘సుడా సుడా ఇడ్లీ’ అంటే వేడి వేడి ఇడ్లీ అంటూ వెంకటేష్ చేసిన ఒక రీల్ తో ఈ ఇడ్లీ బండి బాగా ఫేమస్ అయిపోయింది. మలయాళంతో పాటు వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నా తీరిక దొరికినప్పుడల్లా తన ఇడ్లీ కొట్టుకు వెళతాడు వెంకటేష్. సినిమా షూటింగ్స్ లేని టైంలో తన స్టాల్‌లో కస్టమర్లకు ఇడ్లీలు సర్వింగ్ చేస్తూ కనిపిస్తుంటాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో జెండా పాతిన కొండన్న.. ఇది కలెక్షన్స్ జాతరంటే..!
చరణ్, పవన్, నానిలను దాటి.. కేరళ బాక్సాఫీస్ దగ్గర విజయ్ రాంపేజ్
కొబ్బరికాయల రాసి నుంచి వింత శబ్దాలు.. అక్కడ చూసేసరికీ త్రాచుపాము బుసబుసలు.. చివరకు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

