BIGG BOSS Telugu: చిక్కుల్లో నాగార్జున.. ఏపీ హైకోర్టు నుంచి నోటీసులు. బిగ్ బాస్ ఎంత పని చేసాడు..

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Oct 28, 2022 | 1:57 PM

సీజన్ 6తో హ్యాపీగా సాగుతున్న బిగ్‌ బాస్ జర్నీకి బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు తాజాగా ఈ షోకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చింది. ఈ షో మేకర్స్ తో పాటు.. కింగ్ నాగార్జునకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా నోటీసులిచ్చింది. ఇదే న్యూస్ తో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.


బిగ్ బాస్ షో అశ్లీలతకు.. కేరాఫ్‌గా ఉందని.. యూత్‌ను పెదదోవ పట్టిస్తోందని ఎప్పటి నుంచో.. పేరున్న నేతలు కొంత మంది ఆరోపిస్తున్నారు. దీన్ని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ షోకు వ్యతిరేకంగా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. కోర్టులో పిటిషన్లు కూడా ఇచ్చారు. కాని తాజాగా తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ దిశగా… కాస్త సక్సెస్ అయ్యారు.ఎస్ ! ఇటీవల ఈయన ఈ షోపై ఏపీ హైకోర్టులో ప్రజ ప్రయోజన వాజ్జం దాఖలు చేశారు. అయితే దీన్ని విచారించిన కోర్టు.. రెండు మూడు రోజుల క్రిందట అందరూ షాకయ్యేలా మాట్లాడింది. బిగ్‌ బాస్‌ పై తీవ్ర అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయో తెలుసుకునేందుకు రెండు మూడు ఎపిసోడ్స్‌ చూస్తామని చెప్పింది. ఎలాంటి సెన్సార్‌ షిప్ లేకుండా … షో టెలీకాస్ట్ చేస్తున్నారన్న పిటిషన్ దారుని ఆరోపణతో.. ఈ షో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలను కూడా అప్పుడే ఆదేశించింది. వీటన్నింటినీ పరిశీలించాకే తీర్పు ఇస్తామంటూ.ఇక చెప్పినట్టే… తాజాగా బిగ్ బాస్ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయాన్ని వచ్చింది ఏపీ కోర్టు. పిటిషన్ దారుని వాదనతో పూర్తిగా ఏకీభవిచింది. ఈ క్రమంలోనే ఈ షో నిర్వాహకులకు నోటీలిచ్చింది. దాంతో పాటే … ఈ షో హాస్ట్ కింగ్ నాగార్డునకు… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీలు పంపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu