అది నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో

1947లో దేశానికి వచ్చిన స్వాతంత్రం ఓ భిక్ష అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉంది. 1947లో దేశానికి వచ్చిన స్వాతంత్రం ఓ భిక్షగా పేర్కొన్న కంగనా రనౌత్..1947లో దేశానికి వచ్చిన స్వాతంత్రం ఓ భిక్ష అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉంది. 1947లో దేశానికి వచ్చిన స్వాతంత్రం ఓ భిక్షగా పేర్కొన్న కంగనా రనౌత్.. దేశానికి నిజమైన స్వాతంత్రం నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయిన 2014లోనే వచ్చిందంటూ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర ఉద్యమాన్ని, స్వాతంత్ర పోరాట వీరులను కంగనా రనౌత్ తన వ్యాఖ్యలతో అవమానించారంటూ పలు వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు ఇటీవల ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని శివసేన, కాంగ్రెస్, వామపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. తనకు ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌పై కంగనా స్పందించారు. స్వాతంత్రం గురించి తాను చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని నిరూపిస్తే పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేసేందుకు సిద్ధమని చెప్పారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: రివర్సైన యువతి ఫోట్‌షూట్‌ !! సరదా తీరిందా !! వీడియో

కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణం పొందండి !! వీడియో

సోషల్‌ మీడియాలో యమా యాక్టివ్‌ ఉండే ఈయనెవరో గుర్తుపట్టారా ?? వీడియో

సింగిల్స్​ డే అమ్మకాల్లో రూ.10 లక్షల కోట్ల వ్యాపారం !! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu