Rekha Boj: బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ.? ఊహించని విధంగా సాగనున్న బిగ్ బాస్ 8!

Rekha Boj: బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ.? ఊహించని విధంగా సాగనున్న బిగ్ బాస్ 8!

Anil kumar poka

|

Updated on: Jul 28, 2024 | 1:01 PM

బుల్లితెర ఆడియెన్స్ ను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఈసారి మరిన్ని హంగులు, ఊహించని సెలబ్రిటీలతో మన ముందుకు వస్తున్నట్టు ఈ షో మేకర్స్‌ హింట్ కూడా ఇచ్చారు. ఇక గత ఏడు సీజన్ల కంటే భిన్నంగా ఎనిమిదో సీజన్ ఉంటుందని, అంతకు మించి అనేలా ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని వార్తలు కూడా వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే బిగ్ బాస్ ప్రోమో కూడా రిలీజైంది.

బుల్లితెర ఆడియెన్స్ ను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఈసారి మరిన్ని హంగులు, ఊహించని సెలబ్రిటీలతో మన ముందుకు వస్తున్నట్టు ఈ షో మేకర్స్‌ హింట్ కూడా ఇచ్చారు. ఇక గత ఏడు సీజన్ల కంటే భిన్నంగా ఎనిమిదో సీజన్ ఉంటుందని, అంతకు మించి అనేలా ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని వార్తలు కూడా వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే బిగ్ బాస్ ప్రోమో కూడా రిలీజైంది. బిగ్ బాస్ సీజన్ 8 నయా లోగో అందర్నీ ఆకట్టుకుంటోంది. మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపిక శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సారి బిగ్ బాస్‌కు పవన్ ఫ్యాన్స్‌.. జనసైనికురాలు.. రేఖా భోజ్ వెళుతున్నట్టు ఓ టాక్ బయటికి వచ్చింది. అకార్డింగ్ టూ లేటెస్ట్ ఇన్ఫో.. బిగ్‌బాస్ 8 కోసం షో మేకర్స్‌.. రేఖా భోజ్ ను అప్రోచ్ అవగా.. ఆమె ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

రేఖా భోజ్ అసలు పేరు శ్రీ సుష్మ. ఓ రెండు మూడు తెలుగు సినిమాల్లో నటించిన ఈమె.. ప్రస్తుతం వైజాగ్ లోనే ఎక్కువగా ఉంటోంది. సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్‌లు, వీడియో ఆల్బమ్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ మధ్యన టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిస్తే విశాఖ బీచ్ లో బట్టలిప్పేస్తానంటూ.. షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చి నెట్టింట హాట్ టాపిక్ అయింది. అంతేకాదు ఈమె పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేసింది. అలా పవన్ ఫ్యాన్స్ కు బాగా చేరువైపోయింది రేఖా..! ముక్కుసూటితనం, మంచి మాటకారి కావడంతో బిగ్ బాస్ నిర్వాహకులు రేఖను సంప్రదించారని టాక్. హౌజ్ లోకి వచ్చేందుకు ఆమె కూడా సుముఖంగా ఉన్నారని సమాచారం. మరి రేఖా భోజ్‌కు బిగ్‌బాస్ 8లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కిందో లేదో తెలియాలంటే షో లాంఛ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.