Saripodhaa Sanivaaram Review: హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!

Saripodhaa Sanivaaram Review: హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!

Anil kumar poka

|

Updated on: Aug 30, 2024 | 3:17 PM

నాని సినిమా అంటే ఎలా ఉంటుందో ఓ క్లారిటి ఉంది ఆడియన్స్‌కు. తాజాగా ఈయన సరిపోదా శనివారం అంటూ వచ్చాడు. మాస్ హీరో అవ్వాలని ఎప్పట్నుంచో కలలు కంటున్న నానికి ఇన్నాళ్లకు ఇలాంటి కథ దొరికింది. దాంతో ప్రమోషన్స్‌లో చాలా జోరు చూపించాడు. మరి సినిమాలోనూ అంతే దమ్ముందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

నాని సినిమా అంటే ఎలా ఉంటుందో ఓ క్లారిటి ఉంది ఆడియన్స్‌కు. తాజాగా ఈయన సరిపోదా శనివారం అంటూ వచ్చాడు. మాస్ హీరో అవ్వాలని ఎప్పట్నుంచో కలలు కంటున్న నానికి ఇన్నాళ్లకు ఇలాంటి కథ దొరికింది. దాంతో ప్రమోషన్స్‌లో చాలా జోరు చూపించాడు. మరి సినిమాలోనూ అంతే దమ్ముందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

సూర్య అలియాస్ నానికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. కోపం వచ్చిన మరుక్షణమే కొట్టడానికి వెళ్తుంటాడు. కొడుకు కోపాన్ని చూసిన తల్లి ఛాయాదేవి అలియాస్ అభిరామి వారంలో ఒక్కరోజు మాత్రమే కోపం చూపించాలని ఒట్టు వేయించుకుని చనిపోతుంది. ఆ రోజు శనివారం అవుతుంది. అలా అప్పట్నుంచి వారం అంతా కోపం వచ్చిన వాళ్ల పేర్లు బుక్కులో రాసుకుని.. శనివారం వరకు నిజంగా ఆ కోపం అలాగే కంటిన్యూ అయితే వెళ్లి కొడతాడు. అలా సూర్య కొట్టిన వాళ్ల నుంచి అతడి తండ్రి అలియాస్ సాయి కుమార్తో పాటు అక్కకు కూడా సమస్యలు వస్తుంటాయి. దాంతో అక్క పెళ్లి చేసుకున్నా వీళ్లకు దూరంగానే ఉంటుంది. అదే సమయంలో కానిస్టేబుల్ చారులత అలియాస్ ప్రియాంక మోహన్ సూర్య జీవితంలోకి వస్తుంది. సిఐ దయా అలియాస్ ఎస్‌జే సూర్య దగ్గర చారు కానిస్టేబుల్‌గా ఉంటుంది. మరోవైపు తనకు ఎప్పుడు కోపం వచ్చినా.. సోకులపాలెం అనే ఊరు నుంచి ఎవరో ఒకర్ని తీసుకొచ్చి చావకొడుతుంటాడు దయా. అలా ఓసారి సోకులపాలెం మనుషులతో సూర్యకు రిలేషన్ ఏర్పడుతుంది. అప్పుడే దయా, సూర్య ఫేస్ అవుతారు. అక్కడ్నుంచి ఏం జరిగింది అనేది అసలు కథ..

ముక్కలు ముక్కలుగా చూస్తే ఇది కూడా బాగానే ఉందే.. సరిపోదా శనివారం చూసిన తర్వాత చాలా మంది ఆడియన్స్‌కు కూడా కలిగే ఫీలింగ్ ఇదే. బహుశా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని జోనర్ మాస్ ఒక్కటేనేమో..? జరిగే కథేంటో తెలుసు.. ఏం జరగబోతుందో కూడా తెలుసు. అయినా కూడా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉందంటే దర్శకుడిలో విషయం ఉన్నట్లేగా..! సరిపోదా శనివారం చూస్తుంటే వివేక్ ఆత్రేయపై ఈ ఫీలే వస్తుంది. రొటీన్ కథ తీసుకున్నా.. శ్రీరామ్, ఎవడు లాంటి రిఫరెన్సులు కనిపించినా.. చాలా వరకు బోర్ కొట్టకుండా కమర్షియల్ సినిమా చూపించాడు వివేక్. దానికి నాని, సూర్య తోడయ్యేసరికి మాస్ ఆడియన్స్‌కు సినిమా సరిగ్గా సరిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.