Nani: రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
2012లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈగ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. విజువల్ వండర్ అనే పదానికి టాలీవుడ్‌లో అసలైన అర్థం చెప్పిన చిత్రం ఈగ. పెద్ద హీరోలతోనే కాదు.. చిన్న ఈగతో కూడా సినిమా తీసి బాక్సాఫీసు దగ్గర రికార్డులు సృష్టించొచ్చని నిరూపించారు దర్శకుడు రాజమౌళి. తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి నాని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను విజయేంద్ర ప్రసాద్‌ని ఎప్పుడూ ఈగ సీక్వెల్ గురించి అడగలేదని, కానీ, రాజమౌళితో మాత్రం దీని గురించి సరదాగా చర్చించానని చెప్పారు. ఈగ 2 చేస్తానన్నారు కదా.. ఇది ఎప్పుడు మొదలుపెడదామని అడిగాను. అప్పుడు ఆయన.. ‘‘మేము ఈగ 2’ చేసినా నీతో అవసరం లేదు. ఈగ ఉంటే చాలు. అదే సీక్వెల్‌లో తిరిగి వస్తుంది’’ అని చెప్పారని తెలిపారు. ఈగ సినిమా చేయాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం అన్న నానీ, రాజమౌళి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. ఆయనకు దీని సీక్వెల్ గురించి ఆలోచన వచ్చినప్పుడు కచ్చితంగా ఆ పనులు ప్రారంభిస్తారని నేను అనుకుంటున్నా. అదే జరిగితే మరో అద్భుతమైన చిత్రంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తారు అంటూ దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు.
నాని, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈగ బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకుంది. ఇందులో సుదీప్ విలనిజం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా 2 జాతీయ అవార్డులు, 3 సైమా అవార్డులు, 5 సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించింది. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.