Manchu Manoj: జానీ మాస్టర్ ఇది కరెక్ట్ కాదు.! మంచు మనోజ్ సంచలన ట్వీట్‌..

Manchu Manoj: జానీ మాస్టర్ ఇది కరెక్ట్ కాదు.! మంచు మనోజ్ సంచలన ట్వీట్‌..

|

Updated on: Sep 21, 2024 | 1:37 PM

జానీ మాస్టర్ ఇష్యూ పై సెలబ్రిటీలందరూ రియాక్టవుతున్న వేళ.. టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ కూడా ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ఇష్యూపై రియాక్టయ్యాడు. తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. జానీ మాస్టర్.. కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసని.. తన ట్వీట్‌ లో రాసుకొచ్చిన మనోజ్‌.. అలాంటిది ఈరోజు ఈ మాస్టర్ పై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే..

జానీ మాస్టర్ ఇష్యూ పై సెలబ్రిటీలందరూ రియాక్టవుతున్న వేళ.. టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ కూడా ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ఇష్యూపై రియాక్టయ్యాడు. తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. జానీ మాస్టర్.. కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసని… తన ట్వీట్‌ లో రాసుకొచ్చిన మనోజ్‌.. అలాంటిది ఈరోజు ఈ మాస్టర్ పై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే తన హృదయం ముక్కలవుతోందన్నారు. ఇప్పుడు కాకపోయినా నిజం ఎప్పటికైనా బయటపడుతుందని.. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నది చట్టం నిర్ణయిస్తుందని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు మనోజ్‌. అంతేకాదు జానీ మాస్టర్ పోలీసులకు చిక్కకుండా ఉండడాన్ని మనోజ్ తప్పుబట్టాడు. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుందంటూ మనోజ్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్‌ సిటీ పోలీస్‌, బెంగళూరు నగర పోలీస్‌లకు తన అభినందనలు చెబుతూనే.. చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని తన ట్వీట్‌లో మెన్‌షన్ చేశాడు మనోజ్‌. అంతేకాదు జానీ మాస్టర్‌కు నిజాన్ని ఎదుర్కోండి అంటూ హితవు పలికాడు మనోజ్‌. ఏ తప్పూ చేయకపోతే పోరాటం చేయండని.. తప్పు చేసి ఉంటే దానిని అంగీకరించండంటూ… జానీకి సూచించారు ఈ మ్యాచో స్టార్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us