Satyam Sundaram Review: హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!

Satyam Sundaram Review: హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!

Anil kumar poka

|

Updated on: Sep 29, 2024 | 10:47 AM

కార్తీ, అరవింద స్వామి హీరోలుగా 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా సత్యం సుందరం. తమిళంలో ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు మొదలయ్యాయి. మరి తెలుగులో సత్యం సుందరం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. | సత్యం అలియాస్ అరవింద స్వామి కుటుంబాన్ని ఊర్లో కొందరు మోసం చేయడంతో ఉన్న ఇంటిని అమ్ముకొని వైజాగ్ కు షిఫ్ట్ అవుతారు.

కార్తీ, అరవింద స్వామి హీరోలుగా 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా సత్యం సుందరం. తమిళంలో ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు మొదలయ్యాయి. మరి తెలుగులో సత్యం సుందరం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

సత్యం అలియాస్ అరవింద స్వామి కుటుంబాన్ని ఊర్లో కొందరు మోసం చేయడంతో ఉన్న ఇంటిని అమ్ముకొని వైజాగ్ కు షిఫ్ట్ అవుతారు. అక్కడి నుంచి వచ్చినా కూడా ఆయనకు ఆ ఇల్లు అంటే ప్రాణం. కానీ తమను మోసం చేసిన ఆ ఊరన్నా, ఆ మనుషులన్నా సత్యంకు కోపం. అందుకే మళ్ళీ ఎప్పుడు ఆ ఊరికి వెళ్లడు. కానీ తన చెల్లెలు భువన పెళ్లికి 20 ఏళ్ల తర్వాత ఊరికి రావాల్సి వస్తుంది. అలా పెళ్ళికి వెళ్లిన సత్యానికు బాగా తెలిసిన వ్యక్తిగా సుందరం అలియాస్ కార్తీ పరిచయం అవుతాడు. అతడిని బావ అని పిలుస్తుంటాడు. కానీ సత్యానికి మాత్రం సుందరం ఎవరో గుర్తుకు రాదు. అక్కడ నుంచి ఈ ఇద్దరి పరిచయం ఎలా సాగింది.. మొదట్లో సుందరాన్ని చూసి నసగాడు అనుకున్నా.. ఆ తర్వాత అతనికి ఎమోషనల్ గా సత్యం ఎందుకు అంతగా కనెక్ట్ అవుతాడు అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది..

కొన్ని సినిమాల్లో కథలో ఏదో తెలియని ఒక జీవం ఉంటుంది. అది ఉన్నప్పుడు భాషతో బంధం అవసరం లేదు. ఎవరు చూసినా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఇంకొన్ని సినిమాలు మనతో మాట్లాడుతుంటాయి. కథలు త్వరగా కనెక్ట్ అవుతుంటాయి. జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తుంటాయి. మనతో పాటే ఆ కథ ప్రయాణం చేస్తుంది. అలాంటి సినిమానే సత్యం సుందరం.. ఓ మంచోడి కథ ఇది.. భరించలేనంత మంచోడి కథ. మన లైఫ్ లో ఇలాంటి ఓ మంచోడు ఉంటే బాగుణ్ణు అనిపించే కథ. ఇదేం తెలియని కథ కాదు.. 20 ఏళ్ళ తర్వాత ఊరికి వచ్చిన బావపై బామ్మర్ది చూపించే ప్రేమే ఈ సినిమా. తెలియకుండానే కథలో లీనం అయిపోతాం.. అందులో ఎమోషన్స్ కి కనెక్ట్ అయిపోతాం. వాళ్ళు నవ్వితే నవ్వుతాం.. ఏడిస్తే ఏడుస్తాం.. ఇంత ఎమోషన్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో చూడలేదు. కనీసం ఒక్కసారైనా కళ్ళు చెమ్మగిల్లే కథ ఇది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.