Kamal Haasan: బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!

Kamal Haasan: బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!

Anil kumar poka

|

Updated on: Aug 08, 2024 | 9:33 PM

ప్రముఖ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ గత ఏడేళ్లుగా ‘బిగ్ బాస్ తమిళ్’ రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తనదైన శైలిలో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాబోయే కొత్త సీజన్‌ని కూడా కమల్ నే హోస్టింగ్ చేయాలన్నది అభిమానుల కోరిక. అయితే అంతకు ముందే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు కమల్. ఈసారి తాను బిగ్ బాస్ షోకి హోస్ట్ చేయనని సూటిగా సుత్తిలేకుండా చెప్పారు.

ప్రముఖ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ గత ఏడేళ్లుగా ‘బిగ్ బాస్ తమిళ్’ రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తనదైన శైలిలో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాబోయే కొత్త సీజన్‌ని కూడా కమల్ నే హోస్టింగ్ చేయాలన్నది అభిమానుల కోరిక. అయితే అంతకు ముందే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు కమల్. ఈసారి తాను బిగ్ బాస్ షోకి హోస్ట్ చేయనని సూటిగా సుత్తిలేకుండా చెప్పారు. అంతేకాదు కమల్ హాసన్ తన నిర్ణయం వెనుక కారణాన్ని కూడా వివరిస్తూ.. తన అభిమానులకు ఓ లేఖ రాశారు. 7 ఏళ్ల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ జర్నీకి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని బరువెక్కిన హృదయంతో ఆ లేఖలో తెలియజేశారు. . గతంలో ఒప్పుకున్న సినిమాల వర్క్ కారణంగా ఈసారి బిగ్ బాస్ షోకు అందుబాటులో ఉండలేపోతున్నాన్నా అంటూ అందులో కోట్ చేశారు కమల్.

“బిగ్ బాస్ రియాలిటీ షోతో మీ ఇళ్లకు చేరుకునే అవకాశం నాకు లభించింది. మీరందరూ నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడనై ఉంటాను. మీ సపోర్ట్ వల్ల బిగ్ బాస్ తమిళ రియాల్టీ షో నా బెస్ట్ షో అయింది. నాకు అవకాశమిచ్చిన బిగ్ బాస్ యాజమాన్యానికి రుణ పడి ఉంటాను. మీ అందరికీ, పోటీదారులందరికీ ధన్యవాదాలు” అని కమల్ హాసన్ ఆ లేఖలో రాశారు. ఇక ఈక్రమంలోనే కొత్త సీజన్‌ను ఎవరు హోస్ట్ చేస్తారనే ఈగరల్ అందర్లో నెలకొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.