Prabhas – Spirit: ఒక్క మాటతో స్పిరిట్ మూవీని పైకి లేపిన డైరెక్టర్ వంగా.! వీడియో
యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సెషన్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించి కొద్ది రోజులుగా నెట్టింట చర్చ జరుగుతోంది. స్పిరిట్ మూవీ హారర్ నేపథ్యంలో రాబోతుందని ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు సందీప్.
యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సెషన్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించి కొద్ది రోజులుగా నెట్టింట చర్చ జరుగుతోంది. స్పిరిట్ మూవీ హారర్ నేపథ్యంలో రాబోతుందని ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు సందీప్. దుకాణ్ అనే హిందీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అతిథిగా వెళ్లిన సందీప్ అక్కడి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలని అడగ్గా.. స్పిరిట్, యానిమల్ పార్క్ గురించి కొన్ని విషయాలను బయటపెట్టారు. “ప్రస్తుతం నేను ప్రభాస్ తో చేయనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను. అందరూ అనుకుంటున్నట్లు ఇది హారర్ స్టోరీ కాదు. నిజాయితీ కలిగిన ఓ పోలీస్ ఆఫీసర్ కథ. ప్రస్తుత ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత యానిమల్ పార్క్ చిత్రాన్ని రూపొందిస్తాను. ప్రస్తుతానికి ఈ అప్డేట్ మాత్రమే ఇవ్వగలను ” అంటూ చెప్పుకొచ్చారు సందీప్. దీంతో స్పిరిట్ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇందులో ప్రభాస్ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి.. లాఠీ పట్టుకుని కనిపించనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్
వంట గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి

