Pushpa: బాహుబలి బాటలో పుష్పరాజ్
బాహుబలి ది ఎపిక్ సినిమాతో ఇండియన్ సినిమాకు మరో కొత్త దారి చూపించారు దర్శకుడు రాజమౌళి. వెండితెర మీద రెండు సినిమాలుగా మెప్పించిన సిరీస్‌లను ఒకే మూవీగా మరోసారి రిలీజ్ చేసినా.. ఆడియన్స్ ఆదరిస్తారన్న నమ్మకం కలిగించారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ దృష్టి పుష్ప సిరీస్ మీద పడింది.
బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా రిలీజ్ చేశారు మేకర్స్. రీ రిలీజ్‌లో బాహుబలి మేనియా గట్టిగానే కనిపిస్తోంది. రీ మాస్టర్ చేసిన వర్షన్‌కు ఆడియన్స్ మరోసారి బ్రహ్మారథం పడుతున్నారు. రెండు భాగాలుగా రిలీజ్ అయిన సినిమాను మళ్లీ రీ ఎడిట్ చేసి ఒకేభాగంగా రిలీజ్ చేయటం అన్న ఫార్ములా బాహుబలి విషయంలో సూపర్ సక్సెస్ కావటంతో ఆ ఛాన్స్ ఉన్న సినిమాలు ఇంకా ఏమేం ఉన్నాయన్న డిస్కషన్ జరుగుతోంది. ఈ లిస్ట్‌లో పుష్ప రాజ్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. పుష్ప సినిమాతో నేషనల్ లెవల్‌లో బజ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్, ఆ తరువాత పుష్ప 2తో నార్త్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచిన పుష్ప, పుష్ప 2 సినిమాలను కూడా రీ ఎడిట్ చేసి ఒకే సినిమాగా తీసుకువస్తే బాగుంటుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ప్రజెంట్ సుకుమార్ కొత్త సినిమా ఏది స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు రీ ఎడిట్, రీ మాస్టర్ వర్క్ స్టార్ట్ చేసినా… 2026 ఏప్రిల్ 8, అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా రీ రిలీజ్ చేయొచ్చన్న సజెషన్స్ ఫ్యాన్స్ సైడ్ నుంచి బలంగానే వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prashanth Varma: ప్రశాంత్ వర్మ Vs నిర్మాతలు.. నిజమేనా ??
నిన్న వరద, నేడు బురద.. ఎటు చూసినా హృదయ విదారకమే
రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
నవంబర్ 4 నాటికి మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా ??
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

