Veena Srivani: ‘వారిది ఓవర్ యాక్షన్’ తిరుపతి లడ్డూ వివాదంపై వేణుస్వామి భార్య కామెంట్స్.!
తిరుమల లడ్డూ అంశంపై అందరూ తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి కూడా తిరుమల లడ్డూ వివాదంపై స్పందించింది. తన అభిప్రాయాలను ఒక వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారంటూ వీడియో మొదలెట్టిన శ్రీవాణి..
తిరుమల లడ్డూ అంశంపై అందరూ తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి కూడా తిరుమల లడ్డూ వివాదంపై స్పందించింది. తన అభిప్రాయాలను ఒక వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారంటూ వీడియో మొదలెట్టిన శ్రీవాణి.. లడ్డూ కల్తీ కారణంగా ప్రజల, భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. రాజకీయ నాయకుల సంగతి పక్కన బెడితే.. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఏమన్నా ఓవర్ యాక్టింగ్ చేశారా..? ప్రాయశ్చిత్త శ్లోకాలు వారే కనిపెట్టేసి.. వాటిని చెప్పించేసి, ఏమన్నా రచ్చ చేశారా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
అంతేకాదు వీళ్లు ఎంతో మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారన్నారు శ్రీవాణి. మీరు నిజమైన హిందువులైతే.. వెంకటేశ్వరస్వామి భక్తులైతే.. మమ్మల్ని క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? పెట్టండి ఎంతమంది పెడతారో చూస్తాను అంటూ ఆ వీడియోలో ఫైర్ అయ్యారు శ్రీవాణి. ఇక ఆమె రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.