Mahima Chaudhary: నటి మహిమా చౌదరికి క్యాన్సర్..! వెల్లడించిన అనుపమ్ ఖేర్..
ప్రముఖ నటి మహిమ చౌదరి క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుందని నటుడు అనుపమ్ ఖేర్ బయటపెట్టారు. '‘నా 525వ చిత్రం ‘ద సిగ్నేచ’ర్‌లో ఓ కీ రోల్ కోసం నెల రోజుల క్రితం అమెరికా నుంచి మహిమకు కాల్ చేశాను.
ప్రముఖ నటి మహిమ చౌదరి క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుందని నటుడు అనుపమ్ ఖేర్ బయటపెట్టారు. ‘‘నా 525వ చిత్రం ‘ద సిగ్నేచ’ర్‌లో ఓ కీ రోల్ కోసం నెల రోజుల క్రితం అమెరికా నుంచి మహిమకు కాల్ చేశాను. అప్పుడే తను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని బయటకు వెల్లడించాలని ఆమె కోరుకుంది’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో మహిమ.. క్యాన్సర్ వ్యాధితో తాను చేసిన పోరాటం గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయింది.
“సాధారణ చెకప్ కోసం వెళ్లగా క్యాన్సర్ బయటపడింది. నాకు ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు లేవు. జస్ట్ చెకప్‌కు వెళ్లాను. టెస్ట్ చేసిన డాక్టర్లు ఇది క్యాన్సర్ కణతి అయ్యుండొచ్చు అన్నారు. బయాప్సీ చేసి కణతి తీసి టెస్ట్ చేయగా క్యాన్సర్‌గా తేలింది. ఆ తర్వాత కీమోలు ఇస్తున్న సమయంలో చాలా నీరసించి పోయాను. ఎనర్జీ బాగా తగ్గింది. నా హెయిర్ పోయింది. కానీ ధైర్యంతో ఈ వ్యాధిని ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’ అని వివరించింది. కాగా క్యాన్సర్‌పై ఎంతో మంది మహిళలకు అవగాహన కల్పించేందుకు మహిమ ముందుకొచ్చారని అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చారు. గతంలో షారుఖ్‌ఖాన్‌తో కలిసి మహిమ పర్‌దేస్ చిత్రంలో నటించారు. ఈ సినిమా ఆమెకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!