Alia Bhatt I- Ranbir Kapoor: భర్త రణబీర్ ఆస్తులను మించేపోయిన ఆలియా ఆస్తుల విలువ.!

Alia Bhatt I- Ranbir Kapoor: భర్త రణబీర్ ఆస్తులను మించేపోయిన ఆలియా ఆస్తుల విలువ.!

Anil kumar poka

|

Updated on: Mar 16, 2024 | 3:05 PM

తండ్రి మహేశ్ భట్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోందీ ఈమె. ఇలా సినిమాలు, ప్రకటనలతో బాగానే ఆదాయం ఆర్జిస్తోంది అలియా భట్‌.

తండ్రి మహేశ్ భట్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోందీ ఈమె. ఇలా సినిమాలు, ప్రకటనలతో బాగానే ఆదాయం ఆర్జిస్తోంది అలియా భట్‌. ఈ నేపథ్యంలో ఆమె భర్త, స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కంటే అలియాకే ఎక్కువ ఆస్తులున్నాయని తెలుస్తోంది. కొన్ని నివేదిల ప్రకారం రణబీర్ కపూర్, అలియా భట్ మొత్తం ఆస్తుల విలువ 885 కోట్లుట. ఇందులో అలియా భట్ ఆస్తులే 520 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఇక రణబీర్ కపూర్ కు 365 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని సమాచారం. అలియాతో పెళ్లయ్యాక రణ్‌బీర్‌ కపూర్‌ వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. అతని ఆస్తులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇక అలియా భట్ ఒక్కో సినిమాకు కనీసం 15-18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. భారతదేశంలో ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకునే హీరోయిన్లు చాలా అరుదు. 2021లో భారతదేశంలోని టాప్ 6 అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో అలియాకు చోటు దక్కింది. సినిమాల సంగతి పక్కన పెడితే పలు టాప్ బ్రాండ్లకు ప్రమోటర్ గా వ్యవహరిస్తోందీ. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్‌కు దాదాపు 2 కోట్లు తీసుకుంటుందని టాక్. ఇవి కాకుండా అలియా భట్‌కి బాంద్రాలో విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని ధర 32 కోట్ల రూపాయలు. ఇక తన ప్రొడక్షన్ కంపెనీ ఆఫీస్ కోసం 2 కోట్లతో స్థలాన్ని కూడా కొనుగోలు చేసింది . లండన్ లోనూ ఆమెకు ఇల్లు ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..