Lady Boss: సూపర్‌ బాస్‌.. ఒక్కో ఉద్యోగికి 7 లక్షల గిఫ్ట్‌..! లేడీబాస్‌పై నెట్టింట ప్రశంసల జల్లు.. (వీడియో)

Lady Boss: సూపర్‌ బాస్‌.. ఒక్కో ఉద్యోగికి 7 లక్షల గిఫ్ట్‌..! లేడీబాస్‌పై నెట్టింట ప్రశంసల జల్లు.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 31, 2021 | 10:16 PM

ఎవరైనా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మనం ఎంత కష్టపడి పనిచేసినా బాస్‌ గుర్తించకపోతే వారి బాధ వర్ణనాతీతం. కొంతమంది బాస్‌లు ఉద్యోగులు ఎంత పనిచేసినా గుర్తించకపోగా వారిని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎంతచేసినా వారికి తృప్తి ఉండదు....


ఎవరైనా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మనం ఎంత కష్టపడి పనిచేసినా బాస్‌ గుర్తించకపోతే వారి బాధ వర్ణనాతీతం. కొంతమంది బాస్‌లు ఉద్యోగులు ఎంత పనిచేసినా గుర్తించకపోగా వారిని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎంతచేసినా వారికి తృప్తి ఉండదు. మరికొందరు తమ సిబ్బందిని కుటుంబ సభ్యుల్లా చూస్తారు. వారి కష్టనష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుని వారికి అండగా ఉంటారు. ఇలాంటివారు చాలా అరుదుగా ఉంటారు. తాజాగా ఇలాంటి ఓ మహిళా బాస్‌పైన సోషల్‌ మీడియాలో ప్రశంలసు కురిపిస్తున్నారు నెటిజనులు. అమ్మతనాన్ని చూపించావ్‌ అంటూ పొగుడుతున్నారు. ఈ బాస్‌ను ఇంతలా ప్రశంసించడానికి కారణం ఏంటంటే.. కంపెనీ లాభాలను ఉద్యోగులందరికి సమానంగా పంచారు ఆ లేడీ బాస్‌. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి 7.5లక్షల రూపాయల చొప్పున ఇచ్చి.. తన మంచి మనసు చాటుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే… స్పాంక్స్‌ కంపెనీకి చెందిన లేడీ బాస్‌ పేరు సారా బ్లేక్లీ. ల్యాడ్‌బైబిల్‌ ప్రకారం, ఈమె పెట్టుబడి పెట్టిన సంస్థ బ్లాక్‌స్టోన్ స్పాంక్స్‌ కంపెనీలో మెజారిటీ వాటాను సారా కొనుగోలు చేశారు. బ్లేక్లీ కంపెనీకి భారీగా లాభాలు వచ్చాయి. అయితే సారా ఆ వచ్చిన మొత్తాన్ని తన స్వార్ధం కోసం కాకుండా కంపెనీ ఉద్యోగులందరికి దానిలో వాటా ఇస్తూ.. తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు పార్టీ కూడా ఇచ్చారు సారా. పార్టీలో ఉద్యోగులందరితో “నేను మీకు ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకుంటున్నాను. కంపెనీ లాభాల్లో మీకు వాటా ఇవ్వాలనుకుంటున్నాను. అందుకు మీలో ప్రతి ఒక్కరికీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు 10 వేల డాలర్లు విలువ చేసే ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు ఇవ్వాలనుకుంటున్నాను. టికెట్‌ వద్దు అంటే డబ్బులే తీసుకోవచ్చు’’అని తెలిపారు. “ప్రతి ఉద్యోగి ఈ క్షణాన్ని జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. అందుకే మీకు ఈ గిఫ్ట్‌’’అని ప్రకటించారు సారా. ఈ వార్త విని అక్కడ ఉన్న ఉద్యోగులు సంతోషంతో ఎగిరి గంతేశారు. కొందరు ఆనందం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. లేడీ బాస్‌ సారాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజనులు.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Awesome Facebook: 58 ఏళ్ల క్రితం విడిపోయిన తండ్రి కూతుళ్లు.. కలిపిన ఫేస్‌ బుక్‌..! వైరల్ అవుతున్న వీడియో..

Published on: Oct 31, 2021 09:50 PM