AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elephant March: గంగా నదిలో పుణ్య స్నానం కోసం క్యూ కట్టిన ఏనుగులు..మురిసిపోతున్న నెటిజన్లు.. Viral Video

అబ్బ ఎండలు మండిపోతున్నాయి.. ఒళ్లంతా ఒకటే చిటపట.. ఓ సారి అలా ఏ నదిలోకో.. చెరువులోకో దూకేసి ఓ గంట హాయిగా ఆ నీటిలో ఉంటె బావుండును అనిపిస్తోంది కదూ. ఆ మన పిచ్చికానీ, ఆ అదృష్టం మనకెక్కడ లెండి.

Elephant March: గంగా నదిలో పుణ్య స్నానం కోసం క్యూ కట్టిన ఏనుగులు..మురిసిపోతున్న నెటిజన్లు.. Viral Video
Elephants
KVD Varma
|

Updated on: Apr 21, 2021 | 11:57 AM

Share

Elephant March: అబ్బ ఎండలు మండిపోతున్నాయి.. ఒళ్లంతా ఒకటే చిటపట.. ఓ సారి అలా ఏ నదిలోకో.. చెరువులోకో దూకేసి ఓ గంట హాయిగా ఆ నీటిలో ఉంటె బావుండును అనిపిస్తోంది కదూ. ఆ మన పిచ్చికానీ, ఆ అదృష్టం మనకెక్కడ లెండి. నదులు మనకి అందుబాటులో లేవు.. చెరువులున్నా ఆక్రమణలతొ మురికి కుంటలు అయిపోయాయి. అదీ కాక కరోనా బహిరంగంగా ఎక్కడా ఏమీ చేసే పరిస్థితి లేదు. కానీ, అడవిలో జంతువులకు అలా కాదుగా.. అవి ఎప్పుడు ఏది ఎలా చేయాలనుకుంటే అలా చేయగలవు. ఇక ఈ స్నానం విషయానికి వస్తే.. నీటిలో ఆడుకోవడంలో ఏనుగుల తీరే వేరుగా ఉంటుంది. అంత భారీగా ఉండే అవి నదుల్లో, చెరువుల్లో చేరితే చేసే అల్లరి అలా ఇలా ఉండదు. అయితే, వాటికి ఉన్న క్రమశిక్షణ మరే జంతువుకు ఉండదు అని చెబితే మీరు నమ్ముతారా? రోడ్డు దాటడమే మనం అది పెద్ద హక్కులా.. అడ్డంగా పరిగెత్తి దాటుతాం.. వచ్చే పోయే వాహనాలు నడిపే వాళ్ళు వాళ్ల తిప్పలు వాళ్ళు పడాల్సిందే. కానీ, ఈ వీడియోలో ఏనుగులను చూస్తె మీరు కచ్చితంగా ముచ్చట పడతారు ఎందుకో తెలుసా?

ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా మంగళవారం సాయంత్రం ఒక ఆసక్తికర వీడియో ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆరు ఏనుగులు ఉన్న ఒక గుంపు.. నదిలో చల్లటి నీటిలో స్నానం చేయడానికి వెళుతున్నాయి. ఇది హరిద్వార్ లో జరిగింది. గంగా నదిలో మునకేయడం కోసం ఆ ఏనుగుల గుంపు.. రోడ్డు మీద ఒక పక్కగా.. పద్దతిగా మార్చ్ చేస్తున్నట్టుగా నడిచి వెళుతున్నాయి. దానిని చూసిన అక్కడి స్థానికులు వీడియోలు తీసుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. అదీ కాక ఆ వీడియోకు సుశాంత్ “హరిద్వార్ లోని గంగా వద్ద మునిగిపోయే బుల్స్” అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో మరింతగా వైరల్ అయింది ఈ ట్వీట్. వేలాది మంది ఈ వీడియోను చూశారు. అంతా లైకులు కొట్టేశారు. మరి మీరు కూడా చూసి ఓ లైకేసుకోండి..

ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు..

దీపక్ పూరీ అనీ ఒకాయన ”ఆ ఏనుగులు కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే.. హరిద్వార్ ప్రస్తుతం కుంభ మేళా తొ కరోనా హాట్ స్పాట్ గా మారింది. గంగా నదిలో పుణ్యస్నానం చేసి ఆ ఏనుగులు క్షేమంగా ఇంటికి చేరాలి.” అంటూ కామెంట్ చేశారు. దేనికి కూడా బోలెడు లైకులు వచ్చేశాయి.

భారత్ శ్రీ అనే ఆయన ”కనీసం అవి అయినా సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాయి.” అంటూ కామెంట్ చేశారు.

Also Read: బాలయ్య సినిమాకు భారీ ధర.. అఖండ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమోంట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Typhoid: గుడారాలే ఆసుపత్రి వార్డులు.. చెట్ల కొమ్మలే సెలైన్ స్టాండ్ లు.. కరోనా కాదు.. కానీ..అంతకంటే దయానీయం!