నీతా అంబానీ ప్రయాణించే లగ్జరీ కారు ప్రత్యేకత ఏంటో తెలుసా?వీడియో
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియా కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీల విలాసవంతమైన జీవితం గురించి అందరికీ తెలిసిందే. నీతా అంబానీకి అత్యంత ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే నీతా అంబానీకి ఆడి A9 చామెలియన్ కారు ఉంది. దీని విలువ దాదాపు రూ.100 కోట్లు. ఈ కారు చాలా చాలా ప్రత్యేకమైనది.
అంబానీ కుటుంబంలో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాకూడా ఈ కారు మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ కారు స్వయంగా రంగులు మార్చుతుంది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. ఈ కారులో ఉండే ఓ ప్రత్యేకమైన బటన్‌ను నొక్కగానే కారు తన రంగును మార్చేసుకుంటుంది. ఈ కారుకి విద్యుత్‌తో పెయింట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాహనాలు కేవలం 11 మాత్రమే ఉన్నాయి. ఈ కారు, సింగిల్-పీస్ విండ్‌స్క్రీన్, రూఫ్ కలిగి ఉండటం వలన ఇది అంతరిక్ష నౌకలా కనిపిస్తుంది. ఇది దాదాపు ఐదు మీటర్ల పొడవు ఉండి, విలక్షణమైన రెండు-డోర్ల కాన్ఫిగరేషన్‌తో ఉంటుంది. దీన్ని ఒక అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ వాహనంగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన కొన్నింటిలో ఇది ఒకటి. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలో మీటర్లు. ఈ కారు కాకుండా నీతా అంబానీకి ఇంకా రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB, మెర్సిడెస్-మేబాచ్ S600 గార్డ్, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, రోల్స్ రాయిస్ కల్లినన్, BMW 7 సిరీస్ 760Li సెక్యూరిటీ వంటి అనేక ఇతర లగ్జరీ కార్లు ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
వీడే నా తమ్ముడు.. చిరుతకు రాఖీ కట్టిన మహిళ వీడియో
పక్షి రాజ్ “పన్నాలాల్”ఎంత గొప్ప మనసు.. వీడియో
బంగారం కావాలా? ఈ క్రిమిని పెంచుకుంటే పోలా వీడియో
రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సోదరి వీడియో
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
