OLXలో అమ్మకానికి జగనన్న ఇళ్లు.. వీడియో వైరల్
OLX లాంటి ఆన్ లైన్ యాప్స్ లో ఏదైనా వస్తువును అమ్మకానికి లేద కొనడానికి పెడతారు. కానీ ఏకంగా ఓ లబ్దిదారుడు జగనన్న కాలనీలో ఉన్న ఇంటిని OLX లో విక్రయానికి పెట్టేశాడు. గత ప్రభుత్వం ఏపీలో పేద ప్రజలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలను మంజూరు చేసింది. ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించింది. పెద్ద పెద్ద కాలనీలను ఏర్పాటు చేసి వాటికి జగనన్న కాలనీలు అని పేరు పెట్టారు.
సాధారణ ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ కాలనీల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద ఎత్తున నిధులు అవసరం కావడంతో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. దీంతో కాలనీల్లో మౌళిక సదుపాయాల లేమితో ఇళ్లలో ఉండేందుకు స్థానికులు ఇష్టపడటం లేదు.ఈ క్రమంలోనే తెనాలి పట్టణ పరిధిలోని నేలపాడు జగనన్న కాలనీలో ఉన్న ఇంటిని ఓ లబ్దిదారుడు ఏకంగా ఓఎల్ఎక్స్‌లో విక్రయానికి పెట్టడం ఆసక్తికరంగా మారింది. అప్పులు చేసి నిర్మించుకున్న ఇంటిలో ఉండలేక ఇంటిని అమ్మేస్తున్నట్లు లబ్దిదారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నేలపాడు కాలనీలో ఓ ఇంటిని తొమ్మది లక్షల రూపాయలకు బేరం పెట్టారు. అయితే ఏకంగా ఓఎల్ఎక్స్ లో విక్రయానికి పెట్టడంపై తెనాలి పట్టణంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ధరకు ఇల్లు, ఇంటి స్థలాలు వస్తుండటంతో కొంతమంది కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఇల్లు అయితే తొమ్మిది లక్షల రూపాయల నుండి పన్నెండు లక్షల రూపాయల వరకూ విక్రయిస్తుండగా ఇంటి స్థలాన్ని మూడు లక్షల రూపాయల నుండి ఆరు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. గత ప్రభుత్వం పట్టణ ప్రాంతంలో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలాన్ని పేదలకు ఇచ్చింది. గుంటూరు జిల్లాలో ఓఎల్ఎక్స్ లో జగనన్న కాలనీ ఇల్లు అమ్మకానికి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మరిన్ని వీడియోల కోసం :
వీడే నా తమ్ముడు.. చిరుతకు రాఖీ కట్టిన మహిళ వీడియో
పక్షి రాజ్ “పన్నాలాల్”ఎంత గొప్ప మనసు.. వీడియో
బంగారం కావాలా? ఈ క్రిమిని పెంచుకుంటే పోలా వీడియో
రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సోదరి వీడియో
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
