క్లాస్‌రూమ్‌లో విద్యార్ధితో టీచర్ చేయించిన పనికి..వీడియో
తల్లిదండ్రుల తర్వాత గురువును ప్రత్యక్ష దైవంగా భావిస్తారు విద్యార్థులు. వారిని కన్న బిడ్డలుగా భావించి విద్యా బుద్ధులు నేర్పిస్తారు అధ్యాపకులు. కానీ కొందరు తమ ప్రవర్తనతో ఎంతో ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ కుర్చీలో కూర్చుని ఓ స్టూడెంట్ తో మసాజ్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
మధ్యప్రదేశ్ భోపాల్ లోని గాంధీ నగర్ లోని మహాత్మా గాంధీ హైయర్ సెకండరీ ప్రభుత్వ పాఠశాలలో లంచ్ తర్వాత విద్యార్థులు క్లాసుల్లో ఉన్నారు. నాల్గవ తరగతి గదిలో విద్యార్థులు నేలపై కూర్చొన్నారు. ఒక ఉపాధ్యాయురాలు కుర్చీపై కూర్చొన్నది. మరో కుర్చీపై కాలు పెట్టింది. మోకాళ్లపై కూర్చొన్న ఒక విద్యార్థి ఆమె కాలుకి మసాజ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీచర్ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండించింది. స్కూల్ గేట్ వద్ద ఉన్న గుంతలో తన కాలు మెలిపడినట్లు ఉపాధ్యాయురాలు తెలిపింది. దీంతో విద్యార్థులు తనకు సహాయం చేశారని చెప్పింది. తనను కుర్చీలో కూర్చోబెట్టారని, బెణికిన కాలుతో తాను బాధపడుతుంటే ఒక విద్యార్థి ఆప్యాయతతో మసాజ్ చేశాడని వెల్లడించింది
మరిన్ని వీడియోల కోసం :
వీడే నా తమ్ముడు.. చిరుతకు రాఖీ కట్టిన మహిళ వీడియో
పక్షి రాజ్ “పన్నాలాల్”ఎంత గొప్ప మనసు.. వీడియో
బంగారం కావాలా? ఈ క్రిమిని పెంచుకుంటే పోలా వీడియో
రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సోదరి వీడియో
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
