AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళికి ముందు ఇలా చేయండి..ఇంటికున్న దరిద్రం పారిపోతుంది

దీపావళికి ముందు ఇలా చేయండి..ఇంటికున్న దరిద్రం పారిపోతుంది

Phani CH
|

Updated on: Oct 15, 2025 | 7:59 PM

Share

హిందువులు జరుపుకునే పండుగల్లో దీపావళి ప్రత్యేకమైనది. దేశవ్యాప్తంగా ఎంతో సంతోషంగా ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇళ్లను దీపాల వెలుగులతో నింపేస్తారు. సాధారణంగా ఈ వేడుకలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయి. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, వేడుకలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం దీపావళి పండుగ అమావాస్య తిథి అక్టోబర్ 20 మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 21 సాయంత్రం 4.05 గంటలకు ముగుస్తుంది.

సూర్యాస్తమయానికి అమావాస్య అక్టోబర్ 20నే ఉంటుంది కాబట్టి దీపావళిని ఆ రోజునే జరుపుకోవాలి. దీపావళి పండుగను తెలుగు ప్రజలు ఎంతో శుభప్రదమైన పండుగగా, ఇంట్లోని చీకట్లను తొలగించి వెలుగులు నింపే పండుగగా భావిస్తారు. ఈ క్రమంలో దీపావళి పండుగకు ముందు ఇంటిని అందంగా ముస్తాబు చేస్తారు.దీపావళి పండుగకు చాలామంది ఇంటిని చక్కగా శుభ్రపరిచి, సానుకూల శక్తి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కోసం ఇంట్లోకి అనేక కొత్త వస్తువులను తీసుకొస్తారు. అయితే, కొత్త వస్తువులు తేవడమే కాదు, ఇంట్లోని కొన్ని పాత వస్తువులను కూడా తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఇంటి నుండి ప్రతికూలతను దూరంగా ఉంచాలన్నా.. లక్ష్మీ దేవి మీ ఇంట్లోకి రావాలన్నా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా కొన్నిరకాల వస్తువులను ఇంటి నుంచి తొలగించాలని చెబుతున్నారు. విరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. ఉదాహరణకు.. పగిలిపోయిన పాత్రలు, అద్దాలు, గాజులు, విరిగిన ఫర్నీచర్, ఇలాంటివాటిని సాధ్యమైనంత వరకు మీ ఇంట్లో నుంచి బయటకు పంపించే ఏర్పాట్లు చేయాలి. వాస్తుశాస్త్రం ప్రకారం.. విరిగిన వస్తువులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని నమ్ముతారు. అంతేకాదు.. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో దుమ్ముదూళి, చెత్త నిల్వలు ఇలాంటి వాటిని దీపావళికి ముందు తొలగించుకుంటే మంచిది. పండుగ ముందు ఇలాచేస్తే ప్రతికూల శక్తి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.. బయట నుంచి ఇంట్లోకి రాకుండా ఉంటుంది. అంతేకాదు ఈ ప్రక్రియ ఇంట్లో వారి ఆరోగ్యానికి కూడా మంచిది. పాతబడిన, చిరిగిపోయిన, చాలాకాలంగా ఇంట్లో పడిఉన్న దుస్తులను పండుగ ముందు బయటకు పంపించడం మంచిది. పాత బట్టలు ప్రతికూల శక్తిని పెంచుతాయి. దీపావళి సమయంలో కొత్త బట్టలు ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది ప్రారంభానికి గుర్తుగా ఉంటుంది. పనికిరాని కాగితం, పత్రాలను కూడా దీపావళి పండుగకు ముందు మీ ఇంట్లో నుంచి తీసేయడం మంచిది. ఇవి మానసిక ఒత్తిడికి చిహ్నంగా మారతాయి. ఇది ఇంట్లో సానుకూల శక్తి రాకుండా అడ్డుకుంటుంది. ఇది శ్వాసకోశ సమస్యలకు కూడా కారణం అవుతుంది. పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఈ దీపావళికి ముందు ఇంట్లో నుంచి తొలగించేయడం మంచిది. ఎండిన పూల దండలు, వాడిపోయిన మొక్కలు లేదా పాత కృత్రిమ పువ్వులు నిర్జీవ శక్తికి చిహ్నాలుగా మారతాయి. అవి ఇంట్లోకి ప్రతికూలతను తెస్తాయి. గడువు ముగిసిన మందులు, పాత మేకప్ ఉత్పత్తులు , పనికిరాని సౌందర్య సాధనాలను ఇంట్లో ఉంచడం అశుభంగా చెబుతారు. నిపుణుల సూచన ప్రకారం.. పాత బూట్లు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇంటి శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి. అంతేకాదు అరోగ్యపరంగానూ ఇవి మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. ఈ దీపావళికి పాత బూట్లను చెత్తలో పడేయండి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మ్యాన్‌ ఈటర్‌ మళ్లీ వచ్చింది.. రైతును ఈడ్చుకెళ్లి

టెక్కీలకు షాక్ H-1B హైరింగ్ ఆపేసిన TCS

వరుడి గొంతెమ్మ కోర్కెలు వివాహం రద్దు చేసుకున్న వధువు

బ్యాంక్‌కు చిన్నారులు..! లోన్‌ కావాలి.. సైకిల్‌ కొనుక్కుంటాం

భారీ మొసలిని భుజాలపై మోస్తూ.. రియల్‌ బాహుబలి