మ్యాన్ ఈటర్ మళ్లీ వచ్చింది.. రైతును ఈడ్చుకెళ్లి
మహారాష్ట్రలో చిరుత పులి బీభత్సం సృష్టించింది. ఓ రైతుపై దాడిచేసి లాక్కెళ్లిపోయింది. సగం తిని వదిలేసిన రైతు మృతదేహాన్ని చూసి పోలీసులు, అటవీ అధికారులు, స్థానికులు షాకయ్యారు. భయంతో వణికిపోయారు. మహారాష్ట్ర లోని బీడ్ జిల్లా లో ఈ ఘోరం జరిగింది. అష్తి తాలూకాలోని బావి గ్రామానికి చెందిన 36 ఏళ్ల రైతు పశువులను మేపేందుకు తన పొలంవైపు వెళ్లాడు.
అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న చిరుతపులి అతడిపై దాడిచేసి లాక్కెళ్లింది. పశువులు ఇంటికి చేరినా రైతు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఇరుగుపొరుగువారికి విషయం చెప్పారు. దాంతో చిరుతపులి ఎత్తుకెళ్లి ఉంటుందని అనుమానించిన గ్రామస్తులు వెతకడం మొదలు పెట్టారు. స్థానికులు కొందరు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలికి చేరుకుని, గ్రామస్తులతో కలిసి గాలించగా సగం తిని వదిలేసిన మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. అయితే రైతుపై చిరుత దాడి చేసిందా లేక మరేదైనా జరిగిందా అనేది కచ్చితంగా తెలిసే అవకాశం ఉందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టెక్కీలకు షాక్ H-1B హైరింగ్ ఆపేసిన TCS
వరుడి గొంతెమ్మ కోర్కెలు వివాహం రద్దు చేసుకున్న వధువు
బ్యాంక్‌కు చిన్నారులు..! లోన్ కావాలి.. సైకిల్ కొనుక్కుంటాం
భారీ మొసలిని భుజాలపై మోస్తూ.. రియల్ బాహుబలి
ఈ తరానికి కూడా 150 ఏళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంది.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

