వరుడి గొంతెమ్మ కోర్కెలు వివాహం రద్దు చేసుకున్న వధువు
కట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరం. కానీ కూలీల నుంచి కుబేరుల వరకు వధువు వరుడి తల్లిదండ్రులు కట్నకానుకలను ఇచ్చి పుచ్చుకుంటున్నారు. లేదంటే పెళ్లి క్యాన్సిల్ అనే బెదిరింపులు పెరిగాయి. అలాంటి ఘటనే మైసూరులో జరిగింది. అడిగినంత కట్నం ఇవ్వలేదని కాబోయే వరుడు, అతని కుటుంబసభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు.
దీంతో వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. మైసూరులో డాక్టర్ నీతు కు కుర్గళ్ళికి చెందిన తేజస్‌తో ఆగస్టులో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. వరుడికి 150 గ్రాముల బంగారం, ఒక వజ్రాల ఉంగరం, రూ. 10 లక్షల క్యాష్ అందజేశారు. వారు కోరినట్లుగానే ఓ విలాసవంత హోం స్టేలో నిశ్చితార్థాన్ని జరిపించారు. అలాగే ఘనంగా పెళ్ళి జరిపించాలని షరతు పెట్టగా వధువు కుటుంబీకుల అంగీకరించారు. రూ. 1.50 లక్షల అడ్వాన్స్ కట్టి హాల్‌ని బుక్ చేసుకుని, పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో తేజస్, తల్లిదండ్రులకు మరింత దురాశ పుట్టింది. మరో రూ.25 లక్షల నగదు ఇవ్వాలని, రూ. 20 లక్షల కారును కొనివ్వాలని గొంతెమ్మ కోర్కెలు కోరారు. దీంతో వధువు తల్లి, కుటుంబీకులు విసిగిపోయారు. ఇప్పటికే చాలా ఇచ్చామని, ఇంక ఇవ్వలేమని తెలిపారు. వరుడు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు. కారు కొనివ్వలేనివారు ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నారు, ఈ పెళ్లి తమకు వద్దని చెప్పారు. న్యాయం చేయాలని సరస్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే వరుడు తేజస్, అతని తల్లిదండ్రులపై రివర్స్‌లో పోలీసులు వరకట్నం కేసు నమోదు చేసారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాంక్‌కు చిన్నారులు..! లోన్ కావాలి.. సైకిల్ కొనుక్కుంటాం
భారీ మొసలిని భుజాలపై మోస్తూ.. రియల్ బాహుబలి
ఈ తరానికి కూడా 150 ఏళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంది.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి

