బ్యాంక్‌కు చిన్నారులు..! లోన్ కావాలి.. సైకిల్ కొనుక్కుంటాం
ఈ కాలంలో పిల్లలు చాలా చురుగ్గా ఉంటున్నారు. కొన్నిసార్లు వారి పనులు, మాటలు చూస్తే.. ఆశ్చర్యం కలగక మానదు. కొందరు పిల్లలు ఏకంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తుండగా, కొందరు పిల్లలు తమ సమస్యను ఏకంగా ఎమ్మెల్యేల వద్దకే తీసుకుపోతున్న ఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన చిన్నారుల చొరవ.. కూడా అందరినీ ఆశ్చర్యపరచింది.
ఆ గ్రామానికి చెందిన సునీత అనే మహిళ.. డ్వాక్రా సంఘం తరపున డబ్బులు తీసుకునేందుకు గ్రామంలోని కెనరా బ్యాంకుకు వెళ్లింది. దసరా సెలవులు కావడంతో సునీత తన ఇద్దరి పిల్లలను కూడా బ్యాంకుకు తీసుకెళ్లింది. ఆమె.. బ్యాంకు సిబ్బందితో మాట్లాడుతుండగా..ఆ పిల్లలు అక్కడున్న కస్టమర్‌లతో ముచ్చట పెట్టారు. ఈ క్రమంలో.. అవసరానికి బ్యాంకులు డబ్బులు అప్పుగా ఇస్తాయని తెలుసుకున్నారు. అంతే..నేరుగా బ్యాంకు మేనేజర్ ఛాంబర్‌లోకి వెళ్లారు. తాము ఆడుకోవడానికి సైకిల్ కావాలని.. కనుక మీరు లోన్ ఇస్తే సైకిల్ కొనుక్కుంటామని మొహమాటం లేకుండా అడిగిపారేశారు. దీంతో.. ఒక్కసారిగా ఆ బ్యాంకు అధికారి షాకయ్యాడు. అదే సమయంలో.. సరదాగా.. ‘అప్పు ఇస్తాం గానీ.. తాకట్టుగా ఏం పెడతారు’ అని చిన్నారులను మేనేజర్ ప్రశ్నించాడు. అందుకు చిన్నారులు ఏమాత్రం తడుముకోకుండా.. తమ దగ్గర భూమి, బంగారం ఉందని, మీకు ఏది కావాలో చెబితే అది తాకట్టు పెడతామని జవాబిచ్చారు. దీంతో ఆయన పెద్దగా నవ్వటంతో.. ఈ ముచ్చటను ఆయన బ్యాంకు సిబ్బందికి, అక్కడికి వచ్చిన కస్టమర్లకు చెప్పటంతో వారంతా ఆ చిన్నారుల అమాయకత్వం, ఆత్మవిశ్వాసానికి మెచ్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీ మొసలిని భుజాలపై మోస్తూ.. రియల్ బాహుబలి
ఈ తరానికి కూడా 150 ఏళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంది.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
లక్ అంటే ఇదీ.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన జాలరి
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి

