Adilabad: విరబూసిన అద్భుత పుష్పం.. అదృష్టంగా భావిస్తూ పూజలు చేస్తున్న భక్తులు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బ్రహ్మకమలాల జాతర కొనసాగుతోంది. ఏడాదికి ఒకసారి మాత్రమే పూసే అద్బుత పుష్పం బ్రహ్మ కమలం వికసించడంతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. లక్సెట్టిపేట, ఖానాపూర్ , బైంసా , ఆదిలాబాద్ ఇలా అనేక చోట్ల ఒకే రోజు ఒకే సమయానికి బ్రహ్మకమలం వికసించడంతో అద్భుతంగా భావిస్తున్నారు జిల్లా వాసులు. శ్రావణ మాస చివరి వారం కావడంతో మరింత ప్రత్యేకత చాటుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బ్రహ్మకమలాల జాతర కొనసాగుతోంది. ఏడాదికి ఒకసారి మాత్రమే పూసే అద్బుత పుష్పం బ్రహ్మ కమలం వికసించడంతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. లక్సెట్టిపేట, ఖానాపూర్ , బైంసా , ఆదిలాబాద్ ఇలా అనేక చోట్ల ఒకే రోజు ఒకే సమయానికి బ్రహ్మకమలం వికసించడంతో అద్భుతంగా భావిస్తున్నారు జిల్లా వాసులు. శ్రావణ మాస చివరి వారం కావడంతో మరింత ప్రత్యేకత చాటుకుంది. బ్రహ్మ కమలం వికసించిన ఇంటి వద్దకు చేరుకుంటున్న కాలనీ వాసులు మంగళ హారతులతో కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని సత్య సాయి నగర్ కు చెందిన బొద్దుల వెంకటేశం , గాంధీ నగర్ కు చెందిన అంజన్న ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో ఒకేసారి బ్రహ్మకమలం పుష్పం వికసించింది. అటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని టవర్స్ కాలనీలో ని సుజాత జగదీశ్వర్ ఇంట్లో , భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి ఇంట్లో బ్రహ్మ కమలం విరబూసింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, కాలనీ వాసులు తండోపతండాలుగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మ కమలం అదృష్టానికి చిహ్నం అని.. హిమాలయాల్లో మాత్రమే కనిపించే ఈ పుష్పం… ఏడాదికి ఒకసారి మాత్రమే వికసిస్తుందని.. ఈ పుష్పం వికసించిన ఇంట సిరిసంపదలు కలుగతాయని భక్తులు నమ్ముతారు. కొన్ని గంటలు మాత్రమే వికసించి ఉండే పుష్పాన్ని దర్శించుకునేందుకు జనం క్యూ కట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

