Delhi Shocking Murder: శ్రద్ధావాకర్ హత్యే స్ఫూర్తిగా యువతి దారుణహత్య.. విచారణలో సంచలనాలు.!
సమాజంలో రాను రానూ మానవత్వం మంటగలుస్తోంది. ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్యయే ప్రేరణగా ప్రియుడు.. తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హతమార్చాడు..
సమాజంలో రాను రానూ మానవత్వం మంటగలుస్తోంది. ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్యయే ప్రేరణగా ప్రియుడు.. తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హతమార్చాడు. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య ఎంతటి సంచలనం రేపిందో మనకు తెలిసిందే. ఆమె ప్రియుడే ఆమెను చంపి.. 35 ముక్కలు చేసి ఢిల్లీ శివార్లలో పడేయడం.. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు అదే విధమైన మరిన్ని హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి.. శ్రద్ధావాకర్ హత్య గురించి తెలుసుకొని.. ప్రేరణ పొంది.. ఆమె చంపేశాడు. పాటియాలాకు చెందిన 45 ఏళ్ల మన్‌ప్రీత్ సింగ్.. పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్‌లోని భార్య, ఇద్దరు కొడుకులతో నివాసముండేవాడు. కానీ దంపతుల మధ్య మనస్పర్థలతో.. ఆమెను వదిలేసి.. గణేశ్ నగర్లో రేఖారాణితో సహజీవనం చేస్తున్నాడు. మన్‌ప్రీత్ పాత కార్లు కొని, అమ్మేవాడు. ఈ క్రమంలో నకిలీ పత్రాలు సృష్టించి.. కార్లను అమ్మేందుకు ప్రయత్నించేవాడు. ఈ విషయంపై తరచూ రేఖారాణితో గొడవ జరిగేది. తాజాగా.. రేఖారాణితో మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రద్ధావాకర్ హత్య కేసును టీవీల్లో అదే పనిగా చూసీ చూసీ.. ఆప్తాబ్ లాగానే తాను కూడా రేఖారాణిని వదిలించుకోవాలనుకున్నాడు. ఆమెను కత్తితో పొడిచి చంపాడు. స్థానికుల సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..