Delhi Crime: నడిరోడ్డులో యువతిని కొట్టి లాక్కెల్లిన దుండగులు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Delhi Crime: మంగోల్‌పురి ఫ్లైఓవర్ సమీపంలో ఒక వ్యక్తి మహిళను కొట్టడం.. ఆమెను బలవంతంగా కారులో కూర్చోబెట్టడం వీడియోలో కనిపించింది.

Delhi Crime: నడిరోడ్డులో యువతిని కొట్టి లాక్కెల్లిన దుండగులు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Viral Video
Follow us

|

Updated on: Mar 19, 2023 | 1:51 PM

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. వరుస జరుగుతున్న ఘోరాలతో జనం బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ మహిళను కొట్టి క్యాబ్ లో ఎక్కించుకుని తీసుకెళ్లారు ఇద్దరు దుండగులు. ఈ ఘటన శనివారం రాత్రి ఢిల్లీలోని మంగోల్ పురి ప్రాంతంలో జరిగింది. దీన్నంతటిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ ‌గా మారింది. ఈ వీడియో కాస్తా పోలీసులకు చేరడంతో అప్రమత్తమయ్యా.

శనివారం రాత్రి మంగోల్‌పురి ఫ్లైఓవర్ సమీపంలో ఒక వ్యక్తి మహిళను కొట్టడం.. ఆమెను బలవంతంగా కారులో కూర్చోబెట్టడం వీడియోలో కనిపించింది. అతనితో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. వెహికల్ నెంబర్ ఆదారంగా కారు ఓనర్ హర్యానా లోని గురుగ్రామ్‌లోని రతన్ విహార్ ప్రాంతానికి చెందిందిగా పోలీసులు గుర్తించారు. ఇంత జరుగుతున్నా .. స్థానికులెవరూ క్యాబ్ డ్రైవర్‌ను గానీ, మహిళను కొడుతున్న వ్యక్తిని అడ్డుకోలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు.

క్యాబ్ యజమానిని వెతుక్కుంటూ పోలీసు బృందం వెళ్లినట్లు కమిషనర్ తెలిపారు. శనివారం రాత్రి 11.30 గంటలకు గురుగ్రామ్ లోని ఇఫ్కో చౌక్ లో క్యాబ్ చివరిసారిగా కనిపించినట్లు ఆయన తెలిపారు. క్యాబ్ డ్రైవర్ తో పాటు ముగ్గురు ప్రయాణికులు ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తున్నారు. క్యాబ్ మాత్రం రోహిణి నుంచి వికాస్ పురికి ఉబర్ యాప్ ద్వారా బుక్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉబర్ ద్వారా వికాస్‌పురికి వాహనం బుక్ చేసుకున్నట్లు విచారణలో తేలింది. దారిలో, వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ అమ్మాయి కారులోంచి దిగి వెళ్లిపోవాలనుకుంది. వెంటనే అప్రమత్తమైన ఆ ఇద్దరు యువకులు బలవంతంగా కారులోకి నెట్టినట్లు వీడియోలో కనిపించింది. తదుపరి విచారణ జరుగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

మహిళను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి కొట్టిన ఈ వైరల్ వీడియోను గుర్తించిన ఢిల్లీ మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేస్తున్నట్లు ట్విట్టర్‌లో తెలిపింది. ఈ వ్యక్తులపై కమీషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..