Hyderabad: DAV స్కూల్ విద్యార్థులకు మరో స్కూల్‌లో అడ్మిషన్లు.. స్పష్టం చేసిన మంత్రి సబిత
DAV స్కూల్ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ సీరియస్ అయింది. ఇప్పటికే విచారణ జరిపిన అధికారులు ఇచ్చిన సమాచారంతో స్కూల్ గుర్తింపు రద్దు చేశారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
DAV స్కూల్ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ సీరియస్ అయింది. ఇప్పటికే విచారణ జరిపిన అధికారులు ఇచ్చిన సమాచారంతో స్కూల్ గుర్తింపు రద్దు చేశారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. DAV స్కూల్ ఘటనలో పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలో వెలుగులోకి వచ్చాయి. డ్రైవర్ ముసుగులో రజినీకుమార్ అరాచకాలకు పాల్పడినట్లు తేలింది. ప్రిన్సిపాల్ అండతోనే రజినీకుమార్ రెచ్చిపోయినట్లు విచారణలో బయటపడింది. స్కూల్‌ను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్న డ్రైవర్.. గత ఆరునెలలుగా డిజిటల్ క్లాసు రూమ్‌లో చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలింది. చిన్నారిపై లైంగిక దాడి కేసులో ఇప్పటివరకూ డ్రైవర్ రజినీకుమార్, ప్రిన్సిపల్ ఎస్.మాధవిని అరెస్టు చేశారు. వీరిపై అత్యాచారం కేసుతో పాటు, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. డ్రైవర్‌ను కాపాడే ప్రయత్నం చేశారంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడంతో… స్కూల్ ప్రిన్సిపల్‌పైనా కేసు నమోదు చేశారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
JR NTR: బ్రాండ్ అంటే.. ఇది సర్ !! ఒరిజినల్ అంతే..
జక్కన్న పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్.. ఏంటంటే ??
Kantara: ఆ ఒక్క సీనే.. థియేటర్ దద్దరిల్లేలా చేస్తోంది..
Kajal Aggarwal: కాజల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. నీల్‌ని ఉద్దేశిస్తూ
రెస్టారెంట్ కి వెళ్లిన జో బైడెన్ కు.. షాకిచ్చిన క్యాషియర్
డబ్బులు ఇచ్చే ఏటీఎం కాదు… ఇడ్లీలు ఇచ్చే ఏటీఎం.. చట్నీ, కారప్పొడితో