సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?ఈ బ్యాంకులో తక్కువ వడ్డీకే రుణాలు..అవి ఏంటో తెలుసుకుందాం :second-hand cars video.

Anil kumar poka

|

Updated on: Jun 15, 2021 | 5:53 AM

కొత్త కార్లతో పోల్చితే పాత కార్లను కొనుగోలు చేయాలంటే బ్యాంకు రుణాలపై 3 నుంచి 5 శాతం మేర ఎక్కువ వడ్డీని వసూలు చేస్తున్నారు. యాక్సిస్ బ్యాంకులో కొత్త కారు కొనేందుకు 8.65 శాతం నుంచి 10.9 శాతం వడ్డీకి రుణాలు ఇస్తుండగా...


కరోనా సెకండ్ వేవ్ కేసులు క్రమంగా తగ్గుముఖంపడుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలను పలు రాష్ట్రాలు ఇప్పటికే సడలించాయి. త్వరలోనే లాక్‌డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తేసేందుకు రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇస్తే ఆఫీస్‌లకు వెళ్లి పని మొదలుపెట్టేందుకు ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ భయం ప్రజలకు దడ పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా కంటే సొంత వాహనాలు ఉంటే మంచిదన్న అభిప్రాయం చాలా మంది ఉద్యోగుల్లో నెలకొంటోంది. బడ్జెట్ పరిమితులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త కారు కొనడం కంటే.. సెకండ్ హ్యాండ్ కారుతో సరిపెట్టుకోవడం ఉత్తమంగా భావిస్తున్నారు. పరిస్థితులు మెరుగుపడితే సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మేసి మళ్లీ ప్రజా రవాణా బాటపట్టొచ్చన్నది వారి యోచనగా ఉంది.  దీంతో సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా మార్కెట్‌లో డిమాండ్ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఏవో ఓ సారి తెలుసుకోండి.

మరిన్ని ఇక్కడ చూడండి: రైళ్లో సీటు కోసం ఏకంగా యువకుడు చేసిన తతంగం నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.

Rare Photos and videos: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్ వీడియో.

 Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.

యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.

Published on: Jun 14, 2021 11:47 PM