భారత్‌లో సూపర్ కార్ ఎంట్రీకిముహూర్తం ఫిక్స్! లాంచిగ్ ప్రైస్ ఎంతంటే..
భారత్‌కు సూపర్ కార్ వచ్చేస్తోంది. ఇంతకాలం ఇండియన్స్‌ను ఊరిస్తూ వచ్చిన టెస్లాకార్ల లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. ట్రంప్ పరిచిన బాటలో, భారతీయ రోడ్ల మీదకు టెస్లా కారు పరుగులు పెట్టడానికి రంగం సిద్ధం అవుతోంది. అమెరికా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎలాన్ మస్క్- భారత్‌లో భారీ పెట్టుబడులకు రెడీ అయ్యారు. టెస్లా.. భారతలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ సంస్థ ఇక్కడ నియామకాలు ప్రారంభించింది. షోరూంల ఏర్పాటు కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భారత మార్కెట్లో టెస్లా ఈవీ విక్రయాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వీటి ప్రారంభ ధర 21లక్షల రూపాయలుగా ఉండనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
భారత్‌లో టెస్లా కార్ల ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తుందా? లేక ప్రస్తుతానిక రిటైల్ ఆఫీసులు మాత్రమే తెరుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్ నుంచి ఈవీ కార్లను దిగుమతి చేసుకుని భారత మార్కెట్లో విక్రయించేందుకు టెస్లా సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. షోరూంల ఏర్పాటు కోసం ముంబయిలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్, న్యూదిల్లీలోని ఏరోసిటీ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.ప్రస్తుతానికి భారత్‌లో ఈవీల తయారీపై టెస్లా ఇంకా ఎలాంటి స్పష్టతనివ్వలేదు. కానీ మస్క్ కంపెనీ టెస్లా భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు మాత్రం తెలుస్తోంది. టెస్లా కోసం తొలుత 26 నుంచి 43వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం చర్చించడానికి ఏప్రిల్‌లో భారత్‌కు వస్తోంది టెస్లా బృందం. PMO అధికారులు, కీలక మంత్రులతో ఈ బృందం భేటీ అవుతుంది. దేశంలో పెట్టుబడులు, ఫ్యాక్టరీ నెలకొల్పే ప్రదేశం, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వ విధానాలపై చర్చలు జరుగుతాయి. భారత్‌లో తొలుత రిటైల్ కార్యకలాపాలు ప్రరారంభించిన అనంతరం ఎలక్ట్రిక్ కార్ల తయారీప్లాంట్ కోసం ప్రయత్నాలు చేయబోతన్నట్లు సమాచారం. టెస్లా కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటుకు ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ షార్ట్‌లిస్ట్ అయినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో టెస్లా ప్లాంట్ కోసం పుణె, ఔరంగాబాద్ పోటీ పడుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గౌడన్న.. తొర్రలోకి చూసి షాక్ వీడియో
తన భార్యకు మెసేజ్‌లు పంపుతున్న వ్యక్తి చెయ్యి నరికి..చివరికి వీడియో
పిల్లలు పుట్టరని తెలిసినా పెళ్లి చేసుకున్నాడు.. ఎంతమంచివాడో అనుకుంది..చివరికి..

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
