కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గౌడన్న.. తొర్రలోకి చూసి షాక్ వీడియో
పొట్ట కూటి కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తాటి చెట్లు ఎక్కి కల్లు గీస్తూ జీవించే గీత కార్మికుల బతుకులు ప్రమాదకరం. రియల్ ఎస్టేట్ వ్యాపారం, మొగి పురుగు దెబ్బకు తాటి, ఈత వనాలు అంతరించిపోతున్నాయి. ఊరూరా, వాడవాడలా వెలసిన బెల్టుషాపుల ధాటికి కల్లుకు గిరాకీ తగ్గిపోయింది. అయినా కూడా తరతరాలకు కూడు పెట్టిన తమ కుల వృత్తిని వదిలేందుకు గౌడన్నలకు మనసు ఒప్పదు. ఆ వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.కుల వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న కొందరు పేద గౌడన్నలు ఎండిన తాటి, ఈత వనాలతో కల్లు రాక బతుకులీడుస్తున్నారు. చాలీచాలని ఆదాయంతో కొందరికి రెండు పూటలా తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక వారు చేసే రిస్క్ గురించి ఎంత తక్కువ చెబితే అంత బెటర్
. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఓ గీత కార్మికుడు కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. అయితే పైన ఓ తాటి మట్ట తొర్రలో ఊహించని విధంగా ఓ పాము కనిపించింది. అయితే గీత కార్మికుడు ఆ పామును చూసి.. తత్తరపాటుకు గురికాలేదు. ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ధైర్యసాహసాలతో వ్యవహరించాడు. జాగ్రత్తగా ఆ పామును అక్కడి నుంచి తరిమేశాడు. కాగా తాటి చెట్లు పాములను ఆకర్షిస్తాయని కొందరు అంటున్నారు. ఎందుకంటే తాటి చెట్టు నుంచి వచ్చే సువాసనతో పాటు.. తాటిచెట్ల మీద తినడానికి పాములకు ఎలుకలు దొరుకుతాయని అంటున్నారు. కాగా గీత కార్మికుడి కంట పడిన ఆ పాము కట్ల పాము అని.. అది చాలా ప్రమాదకరమైనది అని కొందరు అంటుంటే.. అది విషపూరితం కాదు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా గౌడ సోదరులు చాలా ధైర్యవంతులని.. కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది సూచిస్తున్నారు.

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
