Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారును ఢీకొట్టిన రాపిడో డ్రైవర్‌.. తర్వాత ఏమైందంటే?వీడియో

కారును ఢీకొట్టిన రాపిడో డ్రైవర్‌.. తర్వాత ఏమైందంటే?వీడియో

Samatha J

|

Updated on: Feb 24, 2025 | 2:03 PM

దేశంలో తరుచూ ఏదో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. రోజురోజుకు వాహనాల రద్దీ పేరగడం, మితి మీరిన వేగంతో ప్రయాణించడమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రయాణీకులు మరణిస్తున్నారు. మరెంతో మంది కాళ్లు, చేతులు పోగొట్టుకుని వికలాంగులుగా మారుతున్నారు. సంతోషంగా గమ్యస్థానాలకు చేరుకోవల్సిన వారు డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం కారణంగా మార్గం మధ్యలోనే ప్రమాదాల బారిన పడుతున్నారు.

 ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఓ ప్రమాదం జరిగింది. రోడ్డు మలుపులోంచి వచ్చిన కారును బైక్‌పై వెళ్తున్న రాపిడో డ్రైవర్‌ ఢీకొట్టాడు. ప్రమాదం ధాటికి అతడు గాలిలోకి ఎగిరి పల్టీలు కొట్టి కిందపడ్డాడు. అక్కడున్న వారు వెంటనే స్పందించారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ఫిబ్రవరి 13న ఇందిరా నగర్‌లో సెక్టార్ 13లోని మలుపు నుంచి ఒక కారు వచ్చింది. బైక్‌పై వేగంగా వెళ్తున్న రాపిడో డ్రైవర్ అభిజిత్ శ్రీవాస్త ఆ కారును బలంగా ఢీకొట్టాడు. దీంతో అతడు గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టి కిందపడ్డాడు. కాగా, ఈ ప్రమాదాన్ని గమనించిన అక్కడున్న వారు వెంటనే స్పందించారు. రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడిన అభిజిత్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

మరిన్ని వీడియోల కోసం :

కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గౌడన్న.. తొర్రలోకి చూసి షాక్ వీడియో 

తన భార్యకు మెసేజ్‌లు పంపుతున్న వ్యక్తి చెయ్యి నరికి..చివరికి వీడియో

పిల్లలు పుట్టరని తెలిసినా పెళ్లి చేసుకున్నాడు.. ఎంతమంచివాడో అనుకుంది..చివరికి..