ప్యాలెస్, క్రూజ్ నౌక కళ్లు చెదిరే ఖతర్ రాజు సంపద వీడియో
భారత పర్యటనకు వచ్చిన ఖతర్ పాలకుడి సంపద ఎంతో తెలిస్తే వామ్మో అనాల్సిందే. అతనికి గోల్డెన్ ప్యాలెస్, లగ్జరీ కార్లు, ఖరీదైన భవంతులు ఉన్నాయి. షేక్ తమీమ్‌కి విమానాశ్రయంలో ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం సలికారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని పరుగులు పెట్టించేందుకు, వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగే దిశగా మోదీ, తమీమ్‌ల మధ్య చర్చలు జరిగాయి. సంపన్నదేశాల్లో ఒకటైన ఖతర్ పాలకుడికి కళ్లు చెదిరే ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఖతర్ దేశం ఏర్పడిన దగ్గరినుంచి షేక్ తమీమ్ కుటుంబమే పాలిస్తోంది. సహజవాయువు, చమురు నిల్వలున్న దేశాన్ని పాలిస్తోన్న అల్‌థానీ వంశం ఆస్తుల విలువ 335 బిలియన్ డాలర్లు అని బ్లూమ్‌బర్గ్ లెక్కగట్టింది. షేక్ తమీమ్ వద్దే రెండు బిలియన్ డాలర్ల ఆస్తిపాస్తులున్నాయి.
దేశ సహజవనరులే గాకుండా, విదేశాల్లో పెట్టుబడులు.. వీరిని ప్రపంచంలోనే సంపన్న కుటుంబాల్లో ఒకటిగా నిలిపాయి. ఒక బిలియన్ డాలర్ల విలువైన దోహా రాయల్ ప్యాలెస్‌లో ఈ కుటుంబం నివసిస్తోంది. బంగారు తాపడంతో ఇంటీరియర్ ఉండటంతో దానిని గోల్డెన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఒమన్‌లో వీరికి వైట్ ప్యాలెస్ ఉంది. ఈ కుటుంబానికి లండన్‌లో 17 బెడ్రూంలతో కూడిన విలాసవంతమైన భవనం ఉంది. పారిస్, న్యూయార్క్‌లోనూ మ్యాన్షన్‌లు ఉన్నాయి. ఇక 400 మిలియన్ డాలర్ల విలువైన విలాసవంతమైన ఓ నౌక ఉంది. ఈ కుటుంబం ఖతర్ అమీరి ఫ్లైట్ పేరిట విమానయాన సంస్థను నడుపుతోంది. అందులో రాయల్ ప్యామిలీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే ప్రయాణిస్తుంటారు. మూడు బోయింగ్ విమానాలతో కలిపి మొత్తం 14 ఫ్లైట్స్ ఆ సంస్థ సొంతం. ఇక లగ్జరీ కార్లు బోలెడు. ఈ కుటుంబానికి కళలంటే ఇష్టం. అందుకే పెయింటిగ్స్ మీదే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఖతర్ స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్ను స్థాపించి, దాని ద్వారా పలు దేశాల్లో క్రీడా రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. అవి ఎక్కువగా ఫుట్‌బాల్‌వే ఉన్నాయి. 2022లో ఫిఫా వరల్డ్ కప్‌కు ఈ దేశం ఆతిథ్యం ఇచ్చింది.
మరిన్ని వీడియోల కోసం :
కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గౌడన్న.. తొర్రలోకి చూసి షాక్ వీడియో
తన భార్యకు మెసేజ్‌లు పంపుతున్న వ్యక్తి చెయ్యి నరికి..చివరికి వీడియో
పిల్లలు పుట్టరని తెలిసినా పెళ్లి చేసుకున్నాడు.. ఎంతమంచివాడో అనుకుంది..చివరికి..

చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి వీడియో

బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్!

చిన్నారి ప్రాణం తీసిన పల్లీగింజ వీడియో

విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం

అయ్యో.. బిర్యానీ ఎంతపని చేసింది.. 8 గంటల పాటు ఆపరేషన్..

కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా అనుమతి కావలి

విశాఖ బీచ్‌లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే
