AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేట్‌ ట్యాక్సీలకు పోటీగా త్వరలో భారత్ ట్యాక్సీలు

ప్రైవేట్‌ ట్యాక్సీలకు పోటీగా త్వరలో భారత్ ట్యాక్సీలు

Phani CH
|

Updated on: Aug 08, 2025 | 8:42 PM

Share

ఓలా, ఊబర్ వంటి ట్యాక్సీ సర్వీసులకు పోటీగా భారత్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. ఇందుకోసం ఎనిమిది ప్రముఖ భారతీయ సహకార సంస్థలు ఒక్కటయ్యాయి. 'భారత్ టాక్సీపేరుతో ఓ సరికొత్త ట్యాక్సీ వ్యవస్థను తీసుకురాబోతున్నాయి. 2025 చివరి నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. జూన్ 6న అధికారికంగా నమోదైన మల్టీ-స్టేట్ సహకారి టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ రూ. 300 కోట్ల అధీకృత మూలధనంతో ఏర్పాటైంది.

ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల్లో 200 మంది డ్రైవర్లను నియమించుకుంది. ప్రతి రాష్ట్రం నుండి 50 మంది డ్రైవర్లు ఉన్నారు. ఈ సంస్థలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్, కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ వంటి సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. భారత్ ట్యాక్సీ సర్వీస్ డ్రైవర్లకు మెరుగైన ఆదాయాన్ని అందించడంతో పాటు, ప్రయాణికులకు తక్కువ ధరకు, సురక్షితమైన, నమ్మదగిన రవాణా సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సహకార మోడల్ ద్వారా డ్రైవర్లు సభ్యులుగా వ్యాపారంలో భాగస్వామ్యం కలిగి ఉంటారు. ఇది సంస్థలో తాము కూడా యజమానులమనే భావనను డ్రైవర్లలో పెంపొందిస్తుంది. త్వరలో ఒక టెక్నాలజీ భాగస్వామిని ఎంపిక చేసి, డిసెంబర్ 2025 నాటికి వినియోగదారులకు అనుకూలమైన రైడ్-హెయిలింగ్ యాప్‌ను ప్రారంభించనున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు, ఒక సలహాదారుతో కలిసి, భారత్ ట్యాక్సీ సర్వీస్‌ను భారతదేశ మొబిలిటీ రంగంలో పోటీదారుగా నిలపడానికి బలమైన మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందిస్తోంది. సహకార నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు సభ్యత్వ డ్రైవ్‌లు కూడా నిర్వహిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

3 కోట్లు పెడితే.. 40 కోట్లు వసూల్.. ఆగస్టు 8న తెలుగులో రిలీజ్

ఆహారం తింటున్న సింహాన్ని వీడియో తియ్యాలనుకున్నాడు.. అంతే

చనిపోయిన వ్యక్తి ఖాతాలోకి లక్షల కోట్లు..! అసలేం జరిగిందంటే.

New Traffic Rules: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే.. అంతే

గుడ్‌న్యూస్‌.. వచ్చే నెలనుంచే వందేభారత్ తొలి స్లీపర్ రైలు