అద్దె కొంప.. సొంత ఇల్లు.. ఏది బెటర్..?
ప్రతి మనిషికి తినడానికి తిండి, కట్టుకోడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు తప్పనిసరి అయిన ప్రధాన అవసరాలు. ప్రతి మనిషి సొంత ఇల్లు ఉండాలని భావిస్తారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. కొందరు సొంత ఇల్లు నిర్మించుకోడానికి చాలా కష్టపడతారు. కొందరు ఎంతకష్టపడినా వారి సొంతింటికల నెరవేరదు. అందుకే అద్దె ఇంట్లోనే నివసిస్తుంటారు.
ఈ పరిస్థితుల్లో, అద్దె ఇంట్లో ఉండటం బెటరా.. సొంత ఇల్లు కొనుక్కోవడం మంచిదా అన్న విషయానికి వస్తే.. చాలా మంది సొంత ఇల్లు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి చాలా కాలం పాటు డబ్బు ఆదా చేసుకుంటారు. అలా పొదుపు లేకపోతే, వారు బ్యాంకు నుండి లోన్స్ తీసుకొని తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. కొందరు అప్పులు చేసి తిప్పలు పడడం ఎందకని అద్దె ఇంట్లోనే ఉంటారు. రుణం తీసుకొని దానిపై వడ్డీ చెల్లించే బదులు, అద్దె ఇంటి నుండి పొదుపు చేసుకోవచ్చని వారు భావిస్తారు. కానీ అది తప్పుడు నిర్ణయం అని నిపుణులు అంటున్నారు. అద్దె ఇంట్లో నివసించడం అనేది అనవసరమైన అప్పులు చేయకుండా.. మన వద్ద ఉన్న డబ్బుతో జీవించడానికి ఒక మంచి మార్గం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు అని నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాలిక అవసరాల కోసం, ఉద్యోగ మార్పుల సమయంలో మీరు ఒకటి లేదా రెండు సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండాల్సి వస్తే అది ఒకే.. కానీ మీ జీవితాంతం అద్దె ఇంట్లో ఉండటం అంటే పక్కవాళ్లను బ్రతికించినట్టే. మన డబ్బును వేస్ట్ చేసుకున్నట్టే. ఎందుకంటే మీరు ప్రతి నెలా ఇంటి అద్దెకు చెల్లించే డబ్బు మొత్తం ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఏళ్ల పాటు ఇలానే అద్దె చెల్లించుకుంటూ పోతే.. మీరు డబ్బును పొదుపు చేయలేరు. అయితే, సొంత ఇల్లు కొనడం లేదా నిర్మించడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ చివరకు మనకు సొంత స్థలం అంటూ ఉంటుంది. మనం పోయిన తర్వాత అది మన పిల్లకైనా దక్కుతుంది. మీరు పూర్తిగా చెల్లించి ఇల్లు కొన్నా లేదా నెలవారీ వాయిదాలు చెల్లించి ఇల్లు కొన్నా, కొన్ని సంవత్సరాల తర్వాత మీకు మీ స్వంత ఇల్లు ఉంటుంది. కానీ, అద్దె ఇంట్లో ఉండటం అలా కాదు, మీరు ఎన్ని సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉన్నా, ఎటువంటి ప్రయోజనం ఉండదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క క్లిక్‌తో మీ బ్యాంకు ఖాతా ఖాళీ.. జాగ్రత్త
భర్త ఆచూకీ లేదంటూ బోరున ఏడ్చిన భార్య.. చివరిలో సూపర్ ట్విస్ట్
గుండె సమస్యలను క్షణాల్లో గుర్తించే ఏఐ టెక్నాలజీ
ట్రంప్ టారిఫ్‌లపై.. సొంత పార్టీలో సెగ! భారత్‌ను దూరం చేసుకొవద్దని హితవు
పాదాలకు చెప్పులు, షూ లేకుండా వాకింగ్ చేయండి.. ఫలితాలు చూస్తే షాకవుతారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

