AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌ టారిఫ్‌లపై.. సొంత పార్టీలో సెగ! భారత్‌ను దూరం చేసుకొవద్దని హితవు

ట్రంప్‌ టారిఫ్‌లపై.. సొంత పార్టీలో సెగ! భారత్‌ను దూరం చేసుకొవద్దని హితవు

Phani CH
|

Updated on: Aug 09, 2025 | 6:54 PM

Share

భారత్‌పై మరోసారి విషం చిమ్మారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. రానున్న 24 గంటల్లో భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచుతామని బెదిరించారు. రష్యా నుంచి భారత్‌ పెద్దమొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని, దీంతో ఉక్రెయిన్‌ యుద్ధానికి ఆజ్యం పోస్తోందని మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. భారత్‌పై సుంకాలు పెంచబోతున్నట్లుగా ట్రూత్‌ సోషల్‌ వేదికగా ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించారు.

ఈ క్రమంలో ట్రంప్‌ సొంత పార్టీలో సెగ పుట్టింది. భారత్‌ను దూరం చేసుకొవద్దంటూ రిపబ్లికన్‌ పార్టీ నేతలు ట్రంప్‌కు సూచిస్తున్నారు. భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లను రిపబ్లికన్‌ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ తప్పు పట్టింది. మిత్రదేశం భారత్‌తో సంబంధాలు దెబ్బతీయొద్దని ట్రంప్‌కు నిక్కీ హేలీ సూచించింది. రష్యా, ఇరాన్‌ చమురుకు చైనా అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. అయినా టారిఫ్‌లపై చైనాకు విరామం ఇచ్చిన విషయాన్ని ట్రంప్‌కు నిక్కీ గుర్తు చేసింది. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయకూడదు కానీ, చైనా చేయొచ్చా అని ఆమె ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. రష్యా నుంచి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందని తెలిపారు. అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారని ట్రంప్‌ పరిపాలనపై పరోక్షంగా విమర్శలు చేశారు. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్‌ అయిన హేలీ.. ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉన్నారు. 2024లో అధ్యక్ష అభ్యర్థి రేసులో పోటీ చేసిన ఆమె.. ఆ తర్వాత ట్రంప్‌కు మద్దతు తెలిపారు. ఇక నిన్న, మొన్నటివరకు భారత్‌ను తమ మిత్రదేశంగా పేర్కొన్న ట్రంప్‌, తాజాగా మాట మార్చేశారు. భారత్‌తో వ్యాపారం చేయడం చాలా కష్టమని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. వాణిజ్యంలో భారత్‌ మంచి భాగస్వామి కాదన్నారు. భారత్‌ అమెరికాతో పెద్దమొత్తంలో వ్యాపారం చేస్తోందని, కానీ.. అమెరికా మాత్రం ఆ స్థాయిలో చేయడం లేదన్నారు. భారత్‌పై 25శాతం సుంకాలు విధించామని, రానున్న 24 గంటల్లో దీన్ని గణనీయంగా పెంచబోతున్నామని స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంపై భారత్‌ వెనక్కి తగ్గాల్సిందేనని హెచ్చరించారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా, యూరప్‌ పా దేశాల అభ్యంతరాలను భారత్‌ ఇప్పటికే గట్టిగా తిప్పికొట్టింది. అణు పరిశ్రమ, విద్యుత్‌ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పదార్థాలను రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకోవడాన్ని ప్రశ్నించింది. మరోవైపు.. అమెరికా వైఖరిపై రష్యా సైతం మండిపడింది. భారత్‌పై వాణిజ్యపరంగా ఒత్తిడిని పెంచుతోందని విమర్శించింది. సార్వభౌమ దేశాలకు తమ వాణిజ్య భాగస్వాములను సొంతంగా ఎంచుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ట్రంప్‌ ఏయే రంగాలపై తాజాగా సుంకాలు విధిస్తారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాదాలకు చెప్పులు, షూ లేకుండా వాకింగ్‌ చేయండి.. ఫలితాలు చూస్తే షాకవుతారు

అసలు వీరు పేరంట్సేనా..? కన్న కొడుకును ఎయిర్‌పోర్ట్‌లో వదిలి వెకేషన్‌కు..?

అరుదైన ‘మాస్క్డ్‌ బూబీ’ని ఎప్పుడైనా చూసారా?

హీరోయిన్ కొత్త దందా… వీడియో కాల్‌కు 30వేలు, వాయిస్‌ కాల్‌కు 20 వేలు

Bigg Boss 9: బిగ్ బాస్‌ 9 కోసం నాగ్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌