AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9: బిగ్ బాస్‌ 9 కోసం నాగ్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌

Bigg Boss 9: బిగ్ బాస్‌ 9 కోసం నాగ్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌

Phani CH
|

Updated on: Aug 09, 2025 | 5:56 PM

Share

తెలుగు బిగ్ బాస్ ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. తొమ్మిదో సీజన్ కోసం బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ తెలుగు నయా సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. గత 6 సీజన్లుగా హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అక్కినేని నాగార్జుననే ఈ సారి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

దీంతో అసలు అక్కినేని నాగార్జునకి ఈ సీజన్‌ కోసం ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడనే చర్చ నెట్టింట మొదలైంది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో 2017లో ప్రారంభమైంది. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత 2వ సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఇక మూడో సీజన్ నుంచి ఇప్పటివరకు కింగ్ నాగార్జుననే హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షోను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకే లక్షల రూపాయల పారితోషకం లభిస్తోంది. ఇక విజేతలకు అయితే దాదాపు అర కోటి ప్రైజ్ మనీ లభిస్తుంది. అలాగే కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా వస్తుంటాయి. మరి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న నాగార్జున ఎన్ని కోట్లు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఏటా బిగ్ బాస్ సీజన్ కోసం సుమారు మూడు నెలల సమయాన్ని వెచ్చిస్తుంటారు నాగార్జున. సో నాగ్‌కు భారీగా రెమ్యునరేషన్ లభిస్తోందని తెలుస్తోంది. అయితే 9వ సీజన్ కోసం అక్కినేని నాగార్జున సుమారు 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గత సీజన్లలోనూ దాదాపు ఇంచుమించుగా ఇదే రెమ్యూనరేషన్ నాగ్ అందుకున్నారట నాగ్. నాగ్ రెమ్యునరేషన్ పక్కకు పెడితే… గత సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ లో మరిన్ని హంగులు, సర్ ప్రైజింగ్ రూల్స్ అండ్ టాస్క్ లు ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు హౌస్ లోకి రాబోయే కంటెస్టెంట్లకు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ పెట్టారని తెలుస్తోంది. టాస్కుల పరంగా కూడా బిగ్ బాస్ టీం సరికొత్తగా ప్లాన్ చేస్తోందట. అలాగే సీక్రెట్ రూమ్, రీ ఎంట్రీ వంటి పాత కాన్సెప్టులను తీసేసి వాటి స్థానంలో కొత్త టాస్కులు ప్రవేశ పెట్టాలని చూస్తున్నారట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kantara: కాంతారను వెంటాడుతున్న మరణాలు

నరాలు కట్ అయ్యేంత సస్పెన్స్! ఇంతకీ ఆ హత్య చేసిందెవరు..?

ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే పుష్పరాజ్‌ రికార్డ్స్‌ను రాజాసాబ్‌ పాతేస్తాడేమో..!

బైక్ పార్కింగ్‌ గొడవ కోపంతో.. హీరోయిన్ సోదరుడి దారుణ హత్య