బైక్ పార్కింగ్ గొడవ కోపంతో.. హీరోయిన్ సోదరుడి దారుణ హత్య
పార్కింగ్ సమస్య కారణంగా మొదలైన లడాయి ఏకంగా హీరోయిన్ సోదరుడి ప్రాణాన్నే బలిగొంది. ఆ హీరోయిన్ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలోకి మునిగిపోయేలా చేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. హ్యుమా ఖురేషి! బాలీవుడ్‌లో ట్యాలెంటెడ్ యాక్టర్‌గా ఫ్రూఫ్ చేసుకున్న ఈమె ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చిన్న గొడవకే ఆమె సోదరుడు దారుణ హత్యకు గురికావడం.. నార్త్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. హ్యూమా ఖురేషి సోదరుడు.. నిజాముద్దీన్‌లోని జంగ్పూర్ భోగల్ బజార్‌లో నివాసముంటున్నాడు. అయితే ఆగస్టు 7న రాత్రి పదకొండు గంటలకు హ్యూమా సోదరుడు ఆసిఫ్ ఇంటి ముందర ఓ ఇద్దరు వ్యక్తులు బైక్ పార్క్ చేశారు. ఈ విషయంగానే ఆసిఫ్ వారిద్దరితో వాదులాడాడు. ఈ క్రమంలోనే గొడవ పెద్దదిగా మారడంతో… ఆ ఇద్దరు పదునైన ఆయుధాలతో హీరోయిన్ సోదరుడిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా గాయపరిచారు.దాడి తర్వాత, ఆసిఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసిఫ్ భార్య స్టేట్మెంట్‌ను కూడా రికార్డు చేశారు. అయితే సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తున్నట్టు.. ఆసిఫ్ భార్య చెబుతున్నట్టు ఈ గొడవ బైక్ పార్కింగ్ సమస్య కారణంగా జరిగిందా? లేదా మరేదైనా కుట్ర కోణం ఉందా? అనే యాంగిల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఆసిఫ్ సిస్టర్ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ కావడంతో.. ఈ కేసును పోలీసులు కాస్త సీరయస్‌గానే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Coolie: కూలీ నెం 1421.. రజనీ పట్టుకున్న ఈ బ్యాడ్జీ నంబర్ వెనుక
ఊరంతా మొసళ్ల పండుగ ఎక్కడో తెలుసా..
ప్రైవేట్ ట్యాక్సీలకు పోటీగా త్వరలో భారత్ ట్యాక్సీలు
3 కోట్లు పెడితే.. 40 కోట్లు వసూల్.. ఆగస్టు 8న తెలుగులో రిలీజ్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

