ఊరంతా మొసళ్ల పండుగ ఎక్కడో తెలుసా..
ముందుంది మొసళ్ల పండుగ అనే సామెత మనలో చాలామంది వినే ఉంటారు. మరి.. నిజంగా అలాంటి పండుగ ఉంటుందా? అంటే.. వందశాతం ఉంది. మన దాయాది దేశం పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఈ పండుగ జరుగుతుంది. అక్కడ స్థానికంగా నివసించే షీది సామాజిక వర్గం వాళ్లు ఏటా ఈ మొసళ్ల పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
తమ తెగ వారు అత్యంత పవిత్రంగా భావించే మొసళ్లకు ఆ రోజున మెడలో పూల దండలు వేసి, కుంకుమ చల్లుతూ సందడి చేస్తారు. అయితే, ఇటీవల కొన్ని భద్రతా కారణాల వల్ల ఆ పండుగను నిర్వహించటం లేదు.కానీ, మన తెలంగాణ పల్లెలో మాత్రం అలాంటి పండుగే జరుగుతుంది. దీనికి సమీప ప్రాంతాల జనం తండోపతండాలుగా రావటం విశేషం. నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్ పట్ల గ్రామ శివారులో 25 ఎకరాల విస్తీర్ణంలో ఓ సరస్సు ఉంది. శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు సమీపంలోనే ఉన్న ఈ కొలనులోకి వర్షపు నీటితో పాటు నది నుంచి ఊట నీరు సైతం చేరుతుంటుంది. గత 40 ఏళ్లలో ఏనాడూ ఇది ఎండిపోయిన దాఖలాలు లేవు. అయితే, కొన్నేళ్ళ క్రితం వరద సమయంలో ఆ కొలనులోకి 3 మొసళ్లు చేరాయి. అక్కడి కొంగలు, చేపలు,నీళ్లు తాగటానికి వచ్చే పందుల వంటి జంతువులను తింటూ అవి బతుకున్నాయి. కాగా, ఇప్పడు వాటి సంఖ్య 60కి పైగా పెరిగింది. క్రమంగా ఈ మొసళ్లే ఈ నీటి సరస్సుకు ప్రత్యేక ఆకర్షణగా మారటంతో.. ఆ గ్రామం వార్తల్లోకి ఎక్కింది. దీంతో..గతంలో నిర్మానుష్యంగా ఉండే ఈ కొలనుకు.. పంచాయతీ మట్టిరోడ్డు నిర్మించింది. మూడేళ్ల క్రితం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చుట్టూ 20 ఎకరాల్లో వేల మొక్కలు నాటి ప్రకృతి వనంగా అభివృద్ధి చేశారు. ఈ కొలనులో మొసళ్ల ఆవాసం గణనీయంగా పెరగడంతో ‘కమ్యూనిటీ కన్జర్వు’గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు అటవీ శాఖ నిర్మల్ డిప్యూటీ రేంజ్ అధికారి సంతోష్ తెలిపారు. అయితే..మొసళ్ల సంఖ్య పెరగడంతో ప్రమాదం కూడా అదే స్థాయిలో పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. ఈ మొసళ్లతోనే తమ ఊరికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని యువత సంబరపడిపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రైవేట్ ట్యాక్సీలకు పోటీగా త్వరలో భారత్ ట్యాక్సీలు
3 కోట్లు పెడితే.. 40 కోట్లు వసూల్.. ఆగస్టు 8న తెలుగులో రిలీజ్
ఆహారం తింటున్న సింహాన్ని వీడియో తియ్యాలనుకున్నాడు.. అంతే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

