ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే పుష్పరాజ్ రికార్డ్స్‌ను రాజాసాబ్ పాతేస్తాడేమో..!
కింగ్ నాగ్ మన్మధుడు సినిమా సక్సెస్ నుంచి... నాగ్ కు డిసెంబర్ ఓ సెంటిమెంట్‌గా మారింది. డిసెంబర్‌లో తన సినిమా వస్తే పక్కా హిట్టు అనే కామెంట్ కూడా చాలా సార్లు కింగ్ నోటి నుంచి వచ్చింది. ఇక ఇదే డిసెంబర్ సెంటిమెంట్ రీసెంట్ డేస్‌లో అల్లు అర్జున్‌కు కూడా బాగా వర్కవుట్ అయింది. పుష్ప1 అండ్ పుష్ప2 ఈ రెండు సినిమాలు డిసెంబర్లోనే రిలీజ్ అయ్యాయి.
బన్నీ పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజీ గుర్తింపును తెచ్చాయి. అన్‌బిలీవబుల్ రికార్డులు కూడా క్రియేట్ అయ్యాయి. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ డిసెంబర్లో వస్తే.. ఆ రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉందనే కామెంట్ వస్తోంది. ప్రభాస్.. మారుతీ డైరెక్షన్లో చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ రాజాసాబ్. రిలీజ్ డేట్ మారుతూ వస్తున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం ఫైనల్ డేట్‌ను అనౌన్స్ చేసింది. డిసెంబర్ 5 పక్కాగా థియేటర్లోకి రాజాసాబ్ వస్తాడంటూ చెబుతోంది. అయితే నార్త్ లెక్కలు.. సౌత్ లెక్కలు ఈ మేకర్స్‌ను ఆలోచనను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నా కూడా.. ప్రస్తుతానికైతే ముందిచ్చిన మాట మీదే ఉన్నారు మేకర్స్. డిసెంబర్‌లో కనిపించడం, కలవడం, కలబడటం పక్కా అనే మాట మీదే ఉన్నారు. వీయఫ్‌యక్స్ మీద బేస్ అయిన సినిమా కాబట్టి, తరచూ రూమర్లయితే వినిపిస్తున్నాయి. వాటి సంగతి పక్కన పెడితే.. లాస్ట్ ఇయర్ పుష్పను మించే కలెక్షన్లు కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. డిసెంబర్ లో రాజాసాబ్ వస్తే.. పుష్ప రికార్డ్ ఖచ్చితంగా బద్దలవుతాయని.. ఫిల్మ్ అనలిస్టులు కూడా చెబుతున్నారు. డిసెంబర్లో సినిమా ఆడేందుకు స్కోప్ ఎక్కువ ఉంటుందని.. అదే మంచి టైం అని అంటున్నారు. అయితే సంక్రాంతి లెక్కలు సౌత్ వరకే పరిమితమని.. కానీ డిసెంబర్ అయితే అటు నార్త్‌లోనే కలిసొస్తుందని కోట్ చేస్తున్నారు. ఈ లెక్కలు.. కామెంట్లు అన్నది పక్కకు పెడితే.. డిసెంబర్ సెంటిమెంట్.. ప్రభాస్ కు ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

