అరుదైన ‘మాస్క్డ్ బూబీ’ని ఎప్పుడైనా చూసారా?
సముద్ర తీరాలకు దూరంగా దీవుల్లో కనిపించే మాస్క్డ్ బూబీ పక్షి ముంబైలో ప్రత్యక్ష మైంది. ఓ సొసైటీ బిల్డింగ్‌లో బూబీ బర్డ్ వాలడంతో ఎన్నడూ చూడని పక్షిని చూడటానికి స్థానికులు ఎగబడ్డారు. ఇది జన సంచారం ఉన్న చోట కనిపించడం చాలా అరుదని పక్షి నిపుణులు అంటున్నారు. వన్యప్రాణి సంరక్షకునికి సమాచారమివ్వడంతో అతను దానిని బంధించి అటవీ శాఖ అధికారులు అందచేశారు.
పరిశీలించి చూడగా అది అరుదైన మాస్క్డ్ బూబీ పక్షిగా గుర్తించినట్లు సునీల్ గుప్తా తెలిపారు. ఇవి సముద్రంలోని మారుమూల దీవుల్లో, ముఖ్యంగా అరేబియా సముద్రంలో కనిపిస్తుంటాయనీ చేపలు వీటి ఆహారమని అన్నారు. తరచూ సమూహాలుగా సంచరిస్తుంటాయని బలమైన గాలుల తాకిడికో లేదా దారి తప్పో ఇటుగా వచ్చి ఉంటుందనీ తెలిపారు. మనుషులంటే వీటికి చాలా భయమని కాకులు వెంటాడటంతో మరో దారి లేక ఇక్కడికి వచ్చి ఉంటుందని వివరించారు. బూబీ అనే పేరు బోబో అనే స్పానిష్ పదం నుంచి వచ్చిందనీ బోబో అంటే నవ్వించేవాడనే అర్థం వస్తుందని చూడటానికి ఈ పక్షులు నవ్వు తెప్పించేలా ఉంటాయి అందుకే వీటికా పేరు వచ్చి ఉంటుంది అని గుప్తా వివరించారు. మాస్క్డ్ బూబీకి పసుపు రంగులో బలమైన ముక్కు పొడవైన రెక్కలు ఉంటాయనీ సముద్రంలో డైవ్ చేసి ఎరను పట్టుకోవడానికి ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయనీ ఆయన తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోయిన్ కొత్త దందా… వీడియో కాల్‌కు 30వేలు, వాయిస్ కాల్‌కు 20 వేలు
Bigg Boss 9: బిగ్ బాస్ 9 కోసం నాగ్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్
Kantara: కాంతారను వెంటాడుతున్న మరణాలు
నరాలు కట్ అయ్యేంత సస్పెన్స్! ఇంతకీ ఆ హత్య చేసిందెవరు..?
ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే పుష్పరాజ్ రికార్డ్స్‌ను రాజాసాబ్ పాతేస్తాడేమో..!
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

