Raksha Ka Bandhan: రక్షా బంధన్ అసలైన స్ఫూర్తిని చాటిన టాటా మోటర్స్ మహిళా ఉద్యోగులు.. మనసుతో రాఖీలు చేసి..
రాఖీ.. కృతజ్ఞత, నమ్మకం, రక్షణకు ప్రతీక. రాఖీ పండుగను టాటా మోటర్స్ స్ఫూర్తివంతమైన వేడుకగా మలిచింది. టాటామోటర్స్ మహిళా ఉద్యోగులు చేసిన చిన్న పని పెద్ద సంతోషాలకు కారణమైంది. స్వయంగా తమ చేతులతో రాఖీలను తయారు చేసి దేశానికి చక్రాలుగా నిలిచి ట్రక్ డ్రైవర్లకు పంపించారు.
టాటా మోటార్స్ జంషెడ్‌పూర్ ప్లాంట్‌లో మహిళా ఉద్యోగులు అసలైన రక్షా బంధన్ స్ఫూర్తిని చాటారు. దేశంలో అత్యంత విశ్వసనీయమైన ట్రక్కులను అసెంబుల్ చేయడంలో ప్రసిద్ధి చెందిన దుర్గా లైన్ మహిళలు.. దేశ చక్రాలుగా నిలిచే ట్రక్ డ్రైవర్లకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. స్వయంగా చేతితో రాఖీలు తయారు చేయడంతో పాటు ప్రేమ, ఆప్యాయతతో కూడిన లేఖలను రాశారు. వీటిని దేశాన్ని పరుగులు పెట్టిస్తూ నిత్యం బిజీగా ఉండే డ్రైవర్లకు పంపించారు.
TV9 నెట్‌వర్క్ సహకారంతో మహిళలు తీసుకున్న ఈ చొరవ..డ్రైవర్లకు మధుర జ్ఞాపకంగా నిలస్తుంది. ‘రక్షా కా బంధన్ – టాటా ట్రక్కులు, దేశ్ కే ట్రక్కులు’ ఒక ప్రత్యేకమన బంధానికి చిహ్నంగా నిలుస్తుంది. కొన్నిసార్లు మనసులు.. అడ్డుగోడలను దాటుకుని దూరాలను లెక్కచేయకుండా ఆప్తులను చేరుకుంటుంది. ఆ మనసు చేసే చిన్న చిన్న పనులు పెద్ద సంతోషాలను ఇస్తుంది. రాఖీ.. కృతజ్ఞత, నమ్మకం, రక్షణకు ప్రతీక. టాటా మోటార్స్‌లో, భద్రత, సంరక్షణ మా ట్రక్కులలో మాత్రమే కాదు.. మన సంస్కృతి, ప్రజలు, మేము మద్దతు ఇచ్చే ప్రతి ప్రయాణంలో అల్లుకుని ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

