AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్‌.. వచ్చే నెలనుంచే వందేభారత్ తొలి స్లీపర్ రైలు

గుడ్‌న్యూస్‌.. వచ్చే నెలనుంచే వందేభారత్ తొలి స్లీపర్ రైలు

Phani CH
|

Updated on: Aug 08, 2025 | 8:04 PM

Share

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. వందేభారత్‌ తొలి స్లీపర్‌ రైలు పట్టాలెక్కేస్తోంది. సెప్టెంబరు నెలనుంచి ఈ స్లీపర్‌ రైలు అందుబాటులోకి వస్తోంది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ఈ కొత్త రైలు భారత రైల్వేలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుందని చెప్పారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య దేశంలోని మొదటి బుల్లెట్ రైలు సేవలు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు.

ఇది 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల 7 నిమిషాల్లో చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ స్లీపర్ ఒక కొత్త రకం సెమీ-హై-స్పీడ్ రైలు. భారత రైల్వేలో రాత్రిపూట ప్రయాణాలకు సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించారు. ప్రస్తుతం దేశంలో 50 కంటే ఎక్కువ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. కానీ అవి కేవలం చైర్ కార్ సౌకర్యంతో శతాబ్ది రూట్‌లలో నడుస్తున్నాయి. ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు రాజధాని రూట్లలో నడిచేలా రూపొందించారు. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఏసీ ఫస్ట్‌క్లాస్, ఏసీ 2 టయర్, ఏసీ 3 టయర్ సహా 16 కోచ్‌లతో 11వందల28 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ రైళ్లు న్యూ ఢిల్లీ-హౌరా, న్యూ ఢిల్లీ-ముంబై, న్యూ ఢిల్లీ-పూణే, న్యూ ఢిల్లీ-సికిందరాబాద్ మధ్య నడిచే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భావ్‌నగర్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆగస్టు 4న డిజిటల్‌గా మూడు కొత్త రైళ్లను ప్రారంభించారు. వీటిలో అయోధ్య ఎక్స్‌ప్రెస్, రేవా-పూణే ఎక్స్‌ప్రెస్, జబల్‌పూర్-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. అలాగే, ఎనిమిది అమృత్ భారత్ రైళ్లను కొత్తగా ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు. భారత రైల్వేల పునర్మిర్మాణంపై అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ హయాంలో భారత రైల్వేలు పెద్ద ఎత్తున ఆధునికీకరణ పొందుతున్నాయని తెలిపారు. భారత రైల్వే చరిత్రలో మొదటిసారిగా రోజుకు 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం రైల్వే ట్రాక్‌లు వేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు 34 వేల కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లు వేసినట్టు తెలిపారు. 1,300 స్టేషన్‌లను పునర్నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Python: రెండు కొండ చిలువలు కలబడితే ఎట్లుంటదో తెలుసా?

సునామీని సైతం అడ్డుకునే అడవులివే! ఏపీ, తెలంగాణ నుంచి పర్యాటకుల క్యూ

ఒక్క ఫోన్‌తో జీవితం ఛిన్నాభిన్నం

ఫుల్‌గా మందు కొట్టాడ.. కారును రైల్వే ప్లాట్‌ఫామ్ పై పార్క్ చేసాడు.. అదే కదా మ్యాజిక్కు

బ్రొకోలీ తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి

Follow Us