AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Python: రెండు కొండ చిలువలు కలబడితే ఎట్లుంటదో తెలుసా?

Python: రెండు కొండ చిలువలు కలబడితే ఎట్లుంటదో తెలుసా?

Phani CH
|

Updated on: Aug 08, 2025 | 8:02 PM

Share

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో పాములకు నిలయంగా చెబుతారు. ప్రతి మూడు ఇళ్లలో ఒక ఇంటి పైకప్పులో పైతాన్‌లు దాగి ఉంటాయట. తాజా ఒక ఇంటి చూరు నుంచి రెండు కొండచిలువలు వేలాడుతూ కనిపించాయి. ఆ రెండు కొండచిలువలూ చెలగాటమాడుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట చేరి తెగ చక్కర్లు కొడుతోంది.

క్వీన్స్‌లాండ్‌లో కార్పెట్‌ పైథాన్స్‌ ఇంటి చూరుల్లో దాక్కుని ఉండటం ఇక్కడ సర్వసాధారణ విషయం. ఈ క్రమంలోనే రెండు మగ కొండచిలువలు ఇంటి పైకప్పు నుండి వేలాడుతూ ఫైట్‌ చేసుకుంటున్న ఒక వీడియోను జేక్‌ స్టిన్సన్‌ అనే స్నేక్‌ క్యాచర్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈయన గత కొంతకాలంగా జేక్స్‌ రెప్టయిల్‌ రిలొకేషన్స్‌ అనే సంస్థను నిర్వహిస్తున్నారు. నివాసాల సమీపానికి వచ్చిన పాములను పట్టుకుని, వాటిని సురక్షిత ప్రాంతాల్లో వదిలేసేందుకు ఈ స్వచ్ఛంధ సంస్థను నిర్వహిస్తున్నారు. స్నేక్ క్యాచర్ జేక్‌ స్టిన్సన్‌ షేర్‌ చేసిన ఈ వీడియోలో.. దాదాపు పది అడుగుల పొడవు ఉన్న రెండు మగ కొండచిలువలు ఒకదానికొకటి భీకరంగా పోట్లాడుకున్నాయి. అదికూడా ఒక ఇంటి చూరు నుంచి కిందికి వేలాడుతూ! రెండు చిలువలూ ఒకదానిపై ఒకటి ఆధిపత్యం సాధించేలా పోట్లాడుకున్నట్టు కనిపించింది. కాసేపటికి ఒక కొండచిలువ ఇంటి పైకప్పు నుంచి కిందకు జారి పడిపోతుంది. అయినప్పటికీ.. పై నుంచి వేలాడుతున్న మరో కొండ చిలువను అందుకునేందుకు తెగ ప్రయత్నించింది. దాడి చేయాలన్న కసితో.. చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి చూరుపై వేలాడుతున్న కొండ చిలువ.. తిరిగి ఇంటి పైకప్పులోకి వెళ్లిపోతుంది. అవి అలా ఫైట్‌ చేస్తుండటం చూస్తే ముచ్చటేస్తున్నదని జేక్‌ స్టిన్సన్‌ పేర్కొన్నారు. ఇదొక అద్భుతమైన దృశ్యమన్నారు. పోరాడే క్రమంలో వీటి శబ్దాలు భయంకరంగా ఉన్నాయని చెప్పారు. దీర్ఘంగా బుసలు కొడుతుంటే.. లారీ ఇంజిన్‌ ఆపినప్పుడు బుస్‌.. అని వచ్చే శబ్దంలా ఉందని తెలిపారు. ఇది పాముల బ్రీడింగ్‌ సీజన్‌. ఈ సమయంలో ఆడ పాములను వెతికే క్రమంలో మగ పాములు చాలా దూకుడుగా ప్రవర్తిస్తాయని జేక్‌ స్టిన్సన్‌ తెలిపారు. కార్పెట్‌ పైతాన్‌లు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. ఇవి విష రహితాలు. కనీసం మూడు మీటర్ల పొడవు వరకూ పెరుగుతాయి. ఆస్ట్రేలియా ఇళ్ల చూరుల్లో ఇవి నిత్యం కనిపిస్తుంటాయి. జనావాసాల్లోకి సహజంగా చొచ్చుకుపోతుంటాయి. వీటి బెడద నివారణకు క్వీన్స్‌లాండ్‌లో అధికారులు ఒక చట్టమే చేశారు. కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సునామీని సైతం అడ్డుకునే అడవులివే! ఏపీ, తెలంగాణ నుంచి పర్యాటకుల క్యూ

ఒక్క ఫోన్‌తో జీవితం ఛిన్నాభిన్నం

ఫుల్‌గా మందు కొట్టాడ.. కారును రైల్వే ప్లాట్‌ఫామ్ పై పార్క్ చేసాడు.. అదే కదా మ్యాజిక్కు

బ్రొకోలీ తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి

Follow Us