సునామీని సైతం అడ్డుకునే అడవులివే! ఏపీ, తెలంగాణ నుంచి పర్యాటకుల క్యూ
ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు, అందమైన ప్రకృతి సోయగాలు, సుందరమైన అటవీ ప్రాంతం.. ఇవన్నీ బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీర ప్రాంతం సొంతం. అక్కడ సహజ సిద్దంగా ఏర్పడిన బీచ్ లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ అందమైన అనుభూతిని పొందేందుకు, సరదాగా గడిపేందుకు సూర్యలంక బీచ్‌కు పర్యాటకులు భారీగా తరలివస్తారు.
సూర్యలంక, వాడరేవు, రామపురం బీచ్ లో ఇక్కడి తీర ప్రాంతం ఆహ్లాదంగా ఉంటుంది. అమరావతి రాజధాని నుండి కేవలం 50 కిలో మీటర్ల దూరంలో మాత్రమే ఉండటంతో అనేక మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి క్యూ కడతారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణాలోని పకృతి ప్రేమికులు కూడా సూర్యలంక తీర ప్రాంతానికి వస్తుంటారు. సూర్యలంక బీచ్ కు రెండు కిలోమీటర్ల పరిధిలోనే పొగరు ఉంటుంది. ప్యార్లీ, నల్లమడ, ఉప్పుటేరు డ్రెయిన్లు సముద్రంలో కలిసే ప్రాంతాన్నే పొగరు అంటారు. ఆదర్శ్ నగర్ నుండి అరగంట పాటు ప్యార్లీ డ్రెయిన్ లో ప్రయాణిస్తే పొగరు చేరుకొవచ్చు. మధ్యలోనే నల్లమడ డ్రెయిన్, ఉప్పుటేర్ ప్యార్లీ డ్రెయిన్ కలిసి చివరికి సముద్రంలో చేరతాయి. ఈ మూడు డ్రెయిన్ లు కలిసే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున మడ అడవులున్నాయి. పకృతి సోయగాలతో ఈ మడ అడవులను తిలకించేందుకు పర్యాటకులు మక్కువ చూపుతుంటారు. ఈ మడ అడవులను సముద్ర తీర ప్రాంత రక్షణ దళంగా చెబుతారు. సునామీ, తుపాన్ వంటి విపత్తులు సంభవించినప్పుడు, సాధారణ పోటు సమయంలోనూ తీర ప్రాంతాన్ని ఈ మడ అడవులే రక్షిస్తుంటాయి. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున విదేశీ పక్షులు, సముద్ర తాబేళ్లు కనిపిస్తాయి. వీటన్నింటిని తిలకించేలా బోట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటక రంగాన్ని పరిశ్రమగా కూటమి ప్రభుత్వం గుర్తించిన తర్వాత స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఆదర్శ నగర్ వద్ద బోట్లు నిలిపి ఉంచేందుకు అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా బోట్లు సముద్రంలోకి వెళ్లేందుకు ప్యార్లీ డ్రెయిన్ విశాలంగా ఉండి లోతు తక్కువుగా ఉంటుంది. ఈ క్రమంలోనే పర్యాటక శాఖ స్పీడ్ బోట్లతో పాటు పర్యాటకులు ప్రయాణించేలా ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏపిలో వైజాగ్ లో బ్లూ ఫాగ్ బీచ్ ఉంది. ఆ తర్వాత సూర్యలంక బీచ్ నే బ్లూ ఫాగ్ బీచ్ గా ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే సూర్యలంక బీచ్ చుట్టుపక్కల ఉన్న పకృతి సోయగాలను తిలకించేలా అనేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క ఫోన్‌తో జీవితం ఛిన్నాభిన్నం
ఫుల్‌గా మందు కొట్టాడ.. కారును రైల్వే ప్లాట్‌ఫామ్ పై పార్క్ చేసాడు.. అదే కదా మ్యాజిక్కు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

