Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Price: చికెన్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.

Chicken Price: చికెన్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.

Anil kumar poka

|

Updated on: Dec 13, 2023 | 4:39 PM

ఎంతో కష్టపడి, లక్షల్లో పెట్టుబడి పెట్టి కోళ్ల పెంపకం చేస్తుంటే.. ధరలు పడిపోవడంతో దానా ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు కోళ్ల పెంపకందారులు. కార్తీక మాసం కావడంతో కోళ్ల రేట్లు పడిపోయాయని మరో పది పదిహేను రోజుల్లో కోళ్ల రేట్లు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. ఇప్పటికే.. పౌల్ట్రీ పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులు పడుతోంది.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.!

ఎంతో కష్టపడి, లక్షల్లో పెట్టుబడి పెట్టి కోళ్ల పెంపకం చేస్తుంటే.. ధరలు పడిపోవడంతో దానా ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు కోళ్ల పెంపకందారులు. కార్తీక మాసం కావడంతో కోళ్ల రేట్లు పడిపోయాయని మరో పది పదిహేను రోజుల్లో కోళ్ల రేట్లు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. ఇప్పటికే.. పౌల్ట్రీ పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులు పడుతోంది.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా చికెన్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు మాంసం ప్రియులు. గత నాలుగునెలల క్రితం కిలో 3 వందల రూపాయలు దాటిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలోకు ఏకంగా 120 నుంచి 140 లకు పడిపోయింది. దీంతో మాంసం ప్రియులు ఎగబడుతున్నారు. కిలో తీసుకునే బదులు రెండు మూడు కిలోలు తీసుకుంటున్నారు. చికెన్ వంటకాలలో వివిధ రకాల చికెన్ వెరైటీస్ వండుకొని తినడానికి ఇష్టపడుతున్నారు. మరోవైపు చికెన్ ధరలు భారీగా పడిపోవడంతో చికెన్ వ్యాపారులు సైతం బిజీ అయిపోయారు. చికెన్ రేట్లు పడిపోవడంతో ఎక్కువ కొనుగోళ్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. దీంతో చికెన్ షాపులకు లాభాలు బాగా వస్తున్నాయని చెబుతున్నారు. నాలుగు నెలల క్రితం ఒక కిలో చికెన్ ధర 300 పైగా ఉండేదని, కార్తీకమాసం కావడంతో ధరలు భారీగా తగ్గిపోయాయని, అమ్మకాలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు కోళ్లపెంపకందారులు. లక్షల్లో పెట్టుబడి పెట్టి కోళ్ల పెంపకం చేశామని, ధరలు పడిపోవడంతో దాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు . ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.