KTR: కాంగ్రెస్ మ్యానిఫెస్టోను బీఆర్‌ఎస్ కాపీ కొట్టిందా? కేటీఆర్ రియాక్షన్ ఇదే..
బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేసిన కాపీ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. 'కాంగ్రెస్‌కు మ్యానిఫెస్టో అన్న మాటను పక్కన పెడితే.. నిజానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో సంక్షేమానికి ఒక స్వర్ణయుగం ప్రారంభమైంది కేసీఆర్ నాయకత్వంలోనే. ఇది ఎవ్వరైనా అంగీకరించాల్సిందే.
బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేసిన కాపీ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘కాంగ్రెస్ మ్యానిఫెస్టో అన్న మాటను పక్కన పెడితే.. నిజానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో సంక్షేమానికి ఒక స్వర్ణయుగం ప్రారంభమైంది కేసీఆర్ నాయకత్వంలోనే. ఇది ఎవ్వరైనా అంగీకరించాల్సిందే. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టో, గ్యారెంటీ స్కీములను ఒకసారి చూడండి. అందులో మా ఆసరా పెన్షన్‌ను కాపీ కొట్టి ఏదో ఒక పేరుతో గ్యారెంటీ స్కీమ్ అని తీసుకొచ్చారు .అలాగే దళిత బంధు దేశంలో మరెక్కడా లేదు. దీనినే కొత్త పేరుతో కాంగ్రెసోళ్లు మ్యానిఫెస్టోలో చేర్చారు. అలాగే మేం పెట్టిన గురుకుల పాఠశాలలను కాపీ కొట్టి ఇంకేదో గ్యారెంటీ పథకమన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల ట్రాక్ రికార్డు కేసీఆర్‌ది. ఎవరు ఎవరిని కాపీ కొట్టారన్నది ప్రజలే నిర్ణయిస్తారు.మా మానిఫెస్టోలో మేం కొత్తగా మూడు పథకాలు మాత్రమే ప్రవేశ పెట్టాం. మిగతావన్నీ ఇప్పుడు అమలవుతున్న పథకాలను మరింత ఎఫెక్టివ్‌గా ప్రజలకు అందిస్తాం. ప్రస్తుతం బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను అటూ ఇటూ మార్చి గ్యారెంటీ స్కీమ్‌లంటూ కాంగ్రెస్ ప్రకటించింది. మరి ఎవరు ఎవరినీ కాపీ కొట్టారన్నది ఫైనల్ గా ప్రజలే నిర్ణయిస్తారు ‘ అని చెప్పుకొచ్చారు కేటీఆర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..