Gold Price: బంగారం ఇకపై కారుచౌక.. 10 గ్రాములు రూ.20 వేలే.! ఎప్పటి నుండి అంటే..

Gold Price: బంగారం ఇకపై కారుచౌక.. 10 గ్రాములు రూ.20 వేలే.! ఎప్పటి నుండి అంటే..

Anil kumar poka

|

Updated on: Sep 09, 2024 | 12:04 PM

కేంద్రంలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన తర్వాత సుంకం తగ్గించడంతో బంగారం రేటు బ్రహ్మాండంగా తగ్గింది. చాలామంది ఆ సమయంలో బంగారం కొనేందుకు ఉత్సాహం చూపించారు. కానీ ఆ తర్వాత మళ్లీ బంగారం ధర పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ఏది ఏమైనా బంగారం ధర రోజురోజుకీ పెరగుతుందే కానీ భారీగా అయితే తగ్గడంలేదు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70 వేలకు అటూ ఇటూగా కొనసాగుతోంది.

కేంద్రంలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన తర్వాత సుంకం తగ్గించడంతో బంగారం రేటు బ్రహ్మాండంగా తగ్గింది. చాలామంది ఆ సమయంలో బంగారం కొనేందుకు ఉత్సాహం చూపించారు. కానీ ఆ తర్వాత మళ్లీ బంగారం ధర పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ఏది ఏమైనా బంగారం ధర రోజురోజుకీ పెరగుతుందే కానీ భారీగా అయితే తగ్గడంలేదు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70 వేలకు అటూ ఇటూగా కొనసాగుతోంది. దీంతో బంగారం కొనాలంటే కస్టమర్స్‌ కాస్త ఆలోచిస్తున్నారు. అంతేకాగే ఇటీవల కాలంలో చెయిన్‌ స్నాచర్స్‌ ఎక్కవైపోయారు. దీంతో మగువలు నగలు వేసుకొని బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈక్రమంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై 9 కేరెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2021తో పోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54 శాతం పెరిగాయి. దీంతో నగలు వేసుకుని దొంగలకు ముట్టజెప్పడం దేనికన్న ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. 9 కేరెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ బంగారంపైనా దాని నాణ్యతలను ధ్రువీకరించే హాల్‌మార్క్ ఉంటుందట.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Sep 09, 2024 10:22 AM